శ్మశానవాటిక ఏర్పాటుకు అధికారి వద్దకు వెళితే అంత శిక్షా?

దీంతో.. అతగాడు అలా మోకాళ్ల మీద వంగి కూర్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి.. వైరల్ గా మారింది.

Update: 2023-09-17 04:43 GMT

చేతిలో ఉన్న అధికారాన్ని అకారణంగా ప్రదర్శిస్తూ.. అరాచకం చేస్తుంటారు కొందరు అధికారులు. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు అధికారి వైఖరి సోషల్ మీడియా పుణ్యమా అని బయటకు రాగా.. సీరియస్ అయిన అధికారులు అతగాడికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

బరేలీ జిల్లా మీర్ గంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా వ్యవహరిస్తున్న ఉదిత్ పవార్ ను కలిసేందుకు గ్రామస్తులు వెళ్లారు. తమ ఊళ్లోని శ్మశానాన్ని ఆక్రమించారని.. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇప్పటికే మూడుసార్లు వినతిపత్రం ఇచ్చినా.. సమస్య పరిష్కారం కాకపోవటాన్ని వారు ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ.. వినతిపత్రం ఇవ్వటానికి వెళ్లిన వారిలోని ఒక వ్యక్తిని తన ముందు వంగి కూర్చోవాలంటూ ఆదేశించారు.

దీంతో.. అతగాడు అలా మోకాళ్ల మీద వంగి కూర్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి.. వైరల్ గా మారింది. సదరు అధికారి దర్పం ప్రదర్శింస్తే.. అతగాడి ముందు గ్రామానికిచెందిన యువకుడు వంగి కూర్చున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది విచారణకు ఆదేశించారు.

సదరు అధికారి ఉదిత్ పవార్ ను పదవి నుంచి తప్పించి.. జిల్లా యంత్రాంగానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. తాను తన చాంబర్ లోకి వచ్చేసరికే.. ఒకరు అలా కూర్చున్నారంటూ చెప్పుకొచ్చారు. అదే నిజమనుకుంటే.. తన ఛాంబర్ లో కూర్చున్న వ్యక్తి వద్దకు వెళ్లి.. అలా కూర్చోవటం సరికాదని చెప్పే వీలుంది కదా? మరి.. ఆ పని ఎందుకు చేయనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News