గ్లామర్ ఇంతేనా పవర్ స్టారూ....బర్రెలక్క సో బెటర్ సారూ...!

బర్రెలక్క కంటే పవర్ స్టార్ పొలిటికల్ గ్లామర్ మరీ ఇంత వీకా. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయి జనసేనను ఇబ్బంది పెడుతోంది.

Update: 2023-12-04 08:12 GMT

బర్రెలక్క కంటే పవర్ స్టార్ పొలిటికల్ గ్లామర్ మరీ ఇంత వీకా. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయి జనసేనను ఇబ్బంది పెడుతోంది. అదెలా అంటే జనసేన తరఫున ఎనిమిది మంది అభ్యర్ధులను పోటీలో పెడితే ఒక్క కూకట్ పల్లిలో తప్ప అంతా డిపాజిట్లు పోయారు. కూకట్ పల్లి లో నలభై వేల దాకా ఓట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల అయిదు వేల ఓట్లను సైతం ఆ పార్టీ అభ్యర్ధులు దాటలేకపోయారు.

దాంతో సోషల్ మీడియాలో ఒక్క లెక్కన ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. బర్రెలక్క ఫస్ట్ టైం పోటీ చేసింది. ఆమెకు ఎవరూ అండా దండా లేరు. పొలిటికల్ గా ఫామస్ కాదు. అయినా సరే అయిదు వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకుని శభాష్ అనిపించుకుంది. ఆమె ముందు పవన్ పవర్ ఇంతేనా సారూ అని కామెంట్స్ పెడుతున్న వారే ఇపుడు ఎక్కువగా ఉన్నారు.

అంతే కాదు బర్రెలక్క అలియాస్ శిరీష్ సో బెటర్ కదా అని అంటున్న వారూ ఉన్నారు. బర్రెలక్క నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయారు. ఆమెకు 5,754 ఓట్లు పడ్డాయి.అయితే మాత్రం ఆమె ఓడి గెలిచినట్లే అని అంటున్నారు. అంతే కాదు పవన్ కంటే ఆమె చాలా నయం అని సోషల్ మీడియా జడ్జీలు డిసైడ్ చేసేశారు.

ఇక జనసేన అభ్యర్ధుల విషయానికి వస్తే కూకట్ పల్లిని మినహాయిస్తే మాత్రం అన్నీ దారుణమైన నంబర్లే ఉన్నాయని అంటున్నారు. తాండూరులో 4,087 ఓట్లు వస్తే కోదాడలో 2,151 ఓట్లు వచ్చాయి. నాగర్ కర్నూల్ లో 1,955 ఓట్లు వస్తే ఖమ్మంలో 3,053 ఓట్లు వచ్చాయి. కొత్తగూడెంలో 1,945 ఓట్లు వస్తే, వైరాలో 2,712, అశ్వారావుపేటలో 2,281 ఓట్లు వచ్చాయి. దాంతోనే జనసేన ఇంత వీకా అని అంటున్నారుట.

ఇదిలా ఉంటే బర్రెలక్క అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో ఫ్యామస్ అయిపోయారు. ఆమె గురించి అంతా మాట్లాడుకునే స్థితికి వచ్చారు. మరి పార్టీ పెట్టి పదేళ్లు అయితే ఏపీలో తాను పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడారు. ఇపుడు 2023లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చూశారు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక తెలంగాణాలో చాలా చోట్ల జనసేన అభ్యర్ధులు నోటాతో పోటీ పడడం చూసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక సినీ సెలిబ్రిటీ. ఆయన రాజకీయాల్లో దశాబ్ద కాలంగా ఉన్నారు. ఆయన అంటే పడి చచ్చే యూత్ ఉన్నారు. బీజేపీతో పొత్తు ఉంది. ఇన్ని హంగులు ఉండి కూడా బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు జనసేన అభ్యర్ధులకు రావడమేంటి సామీ అని సెటైర్లు పేల్చుతున్నారు.

సూపర్ స్టార్ డం ఉన్న పవన్ ఎన్నికల్లో దాన్ని కన్వర్ట్ చేసి తన అభ్యర్ధులకు ఓట్ల వర్షం కురిపించడంలో విఫలం అవుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక పవన్ తీరు కూడా ఓటర్లకు ఒక చాన్స్ ఇచ్చేలా చేయడం లేదు అంటున్నారు. పూటకో పార్టీ స్టేట్ కో పార్టీతో పొత్తులు పెట్టుకుంటూ పవన్ చేస్తున్న పాలిటిక్స్ కూడా జనసేనను గందరగోళంలోకి నెడుతోంది అని అంటున్నారు.

ఏది ఏమైనా ఏపీ ఎన్నికల్లో ఈసారి జనసేన ఫేటూ రూటూ మార్చేస్తామని చెబుతూ వచ్చిన పవన్ అనవసరంగా తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ మాత్రం ఓట్లకు పోటీ చేయడం ఎందుకు అన్న వరూ ఉన్నారట. మరి ఇది కాస్తా ఏపీ మీద దెబ్బ కొడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News