మోడీ సర్కారు సమర్పించు ‘భారత్’ ఆటా.. కేజీ ఎంతంటే?
మొన్నటివరకు టమోటా ఠారెత్తిస్తే.. తాజాగా ఉల్లి ఘాటు మొదలైంది.దీంతో.. పెరిగే ధరలకు బదులుగా కేంద్రం ఉల్లిపాయల ధరలను సరసమైన ధరలతో ప్రజలకు అందించే ఏర్పాట్లుచేస్తోంది.
మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళలో.. పెరుగుతున్న ధరలు.. సామాన్యుల ఇక్కట్ల గురించి మోడీ సర్కారు తెగ థింక్ చేయటం షురూ చేసింది. గడిచిన పదేళ్లలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరగటం.. జీవన వ్యయం గతంతో పోలిస్తే రెట్టింపు కావటం తెలిసిందే. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నిత్యం వినియోగించే పెట్రోల్.. డీజిల్ మీద వేసిన బాదుడు దెబ్బకు మిగిలిన అన్ని రంగాల్లోనూ ధరలు పెరిగాయి. దీనికి తోడు కరోనా ఎఫెక్టు దీనికి తోడైంది,
ధరల పెరుగుదలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. మౌనమే తన మార్కుగా వ్యవహరించే మోడీ సర్కారు మాట్లాడలేదు. అయితే.. ఎన్నికలు దగ్గరకు వచ్చిన వేళ.. సామాన్యులకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మాటను చేతల్లో చూపించే పని షురూ చేసింది. మొన్నటికిమొన్న పప్పుల ధరలు భారీగా పెరగటంతో.. భారత్ డాల్ పేరుతో మార్కెటింగ్ మొదలు పెట్టిన కేంద్ర సర్కారు.. తాజాగా భారత్ ఆటా పేరుతో గోధుమ పిండి అమ్మకాల్ని షురూ చేసింది.
బహిరంగ మార్కెట్ లో ఆన్ బ్రాండెడ్ గోధుమ పిండి కేజీ రూ.36 వరకు ఉంది. ఇలాంటి వేళ.. కేజీ గోధుమ పిండిని రూ.27.50కు అమ్మనున్నట్లుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత్ ఆటా పేరుతో తయారు చేసిన కేజీ పాకెట్ ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. నేషనల్ కో ఆపరేటివ్ కన్య్జూమర్ ఫెడరేషన్.. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా దేశంలోని 2వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్ డాల్.. గోధుమపిండి.. ఉల్లిపాయలను సరఫరా చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
మొన్నటివరకు టమోటా ఠారెత్తిస్తే.. తాజాగా ఉల్లి ఘాటు మొదలైంది.దీంతో.. పెరిగే ధరలకు బదులుగా కేంద్రం ఉల్లిపాయల ధరలను సరసమైన ధరలతో ప్రజలకు అందించే ఏర్పాట్లుచేస్తోంది. ఇక.. భారత్ గోధుమపిండి కోసం భారత ఆహార సంస్థ నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కేజీ రూ.21.5 కే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీలకు కేటాయించారు. అక్కడ తయారుచేసే ఆటా పిండిని దేశ వ్యాప్తంగా అమ్మనున్నారు.
నిజానికి ఏ ఫిబ్రవరి నుంచి ప్రయోగాత్మకంగా కో ఆపరేటివ్ ఆవుట్ లెట్లలో కేజీ ఆటాను రూ.29.5కు అమ్ముతున్నారు. దీనికి బదులుగా ఇప్పుడు కేజీకి రూ.2 చొప్పున తగ్గిస్తూ రూ.27.5కేఅందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మరి.. భారత్ ఆటా పేరుతో సిద్దం చేసిన గోధుమపిండికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.