టీడీపీ మూకుమ్మడి రాజీనామాలు... జగన్ కి బిగ్ చాలెంజ్...?

చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ చంద్రబాబు మినహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు ఇస్తూ స్పీకర్ కి అందచేస్తారు అంటున్నారు.

Update: 2023-09-20 16:37 GMT

తెలుగుదేశం పార్టీ ఒక భారీ ఎత్తుగడకు రెడీ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ మీద ఇప్పటిదాకా జరిగిన నిరసనలు ఒక మోస్తరుగానే ఉన్నాయని అంటున్నారు. దీని మీద తెలుగు రాష్ట్రాలలోనే అనుకున్న విధంగా చర్చ అయితే సాగడంలేదు. రాజకీయ కాక రేగలేదు. జాతీయ స్థాయిలో కదిలించాలని చూసినా కూడా ఎక్కడా ఆ జోరు అయితే కనిపించలేదు

దాంతో వైసీపీ కొంత ఊపిరి పీల్చుకుంది. బాబు అరెస్ట్ రిమాండు అన్నీ కలుపుకుని రెండు వారాలు అవుతోంది. బాబుని పదహారు గంటల పాటు అయినా జైలులో పెట్టి వైసీపీ ఆనందించాలని చూస్తోంది అని బాలయ్య తొలి రోజు అన్నారు. ఇపుడు పదహారు గంటలు కాదు కదా పదహారు రోజులు పట్టేట్టుంది అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు అరెస్ట్ మాత్రమే ఏపీలో చర్చకు రావాలని టీడీపీ తలపోస్తున్నా అది మాత్రం జరగడం లేదు. చర్చ పెద్ద ఎత్తున జరిగితే మాత్రం అది టీడీపీకి సానుభూతిగా మారి వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది అని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో మంట పుట్టించేలా భారీ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ తెర తీయనుంది అని అంటున్నారు.

దానికి ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని చూస్తోంది అంటున్నారు. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారభం అవుతున్నాయి. ఈ సమావేశాలలోనే బాబు అక్రమ అరెస్ట్ ని ప్రస్తావించడం ద్వారా చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఒకవేళ చర్చకు అధికార పక్షం అంగీకరించకపోతే సభలో నిరసనలు తెలియచేయలాని కూడా ఆలోచిస్తున్నారు.

అదే విధంగా సభలో రభస సృష్టించడంతో పాటు సభ చివరి రోజున చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ చంద్రబాబు మినహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు ఇస్తూ స్పీకర్ కి అందచేస్తారు అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. దాంతో ఉప ఎన్నికలు రావచ్చు అని అంటున్నారు.

అలా డిసెంబర్లో అయిదు రాష్ట్రాలతో పాటు జరిగే ఉప ఎన్నికలకు వెళ్ళడం ద్వారా అధికార వైసీపీకి చెక్ చెప్పాలని చూస్తున్నారు. వైసీపీ మీద జనంలో వ్యతిరేకత ఉందని చాటి చెప్పడంతో పాటు తాము మళ్ళీ గెలిచి రావాలని చూస్తున్నారు ఒక వేళ ఉప ఎన్నికలు కనుక జరగకపోయినా తమ రాజీనామాలతో జాతీయ స్థాయిలో రాజకీయంగా అతి పెద్ద సంచలనం సృష్టించవచ్చునని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఏ విధంగా చూసినా చంద్రబాబు అరెస్ట్ అన్నది రాజకీయ కాక పుట్టించాలన్న ఆలోచనలతో టీడీపీ ఉంది అని అంటున్నారు. అయితే మూకుమ్మడి రాజీనామాలు టీడీపీ ఎమ్మెల్యేలు చేసినా స్పీకర్ వాటిని ఆమోదించకపోతే వారు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. స్పీకర్ ఎపుడు అనుకుంటే అపుడే ఆ రాజీనామాలు ఆమోదం పొందుతాయి. అందువల్ల ఉప ఎన్నికలు రావు అంటున్నారు. దాంతో పాటు టీడీపీ ఎత్తులు సాగనీయకుండా వారు కనుక రాజీనామాలు చేస్తే వాటిని పక్కన పెట్టడానికి అధికార పార్టీ వ్యూహం ఎటూ ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.

Tags:    

Similar News