కూతురు మొగుడిని పెళ్లాడిన అత్త... అయినా అది త్యాగమట

కానీ, ఆమె కూడా.. అల్లుడి మోజులో ప‌డిపోయింది. ఇరువురూ... అనేక సార్లు.. మామ లేని స‌మ‌యంలో ఒంట‌రిగా గ‌డిపారు.

Update: 2024-04-30 12:30 GMT

బుద్ధి గుడిసేటిద‌ని అంటారు. అది ఇప్పుడు నిజ‌మైంది. పిల్ల‌ను ఇచ్చి.. క‌న్యాదానం చేసిన ఇంటికే ఓ అల్లుడు ఎస‌రు పెట్టాడు. ఏకంగా అత్త‌పైనే క‌న్నేసి.. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వినేందుకు ఎబ్బెట్టుగా.. కొంత‌.. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజం. జ‌రిగింది కూడా. అయితే.. మ‌న ద‌గ్గ‌ర‌కాదు.. బిహార్‌లో !..నిజానికి అత్త అంటే.. త‌ల్లిత‌ర్వాత త‌ల్లిలాంటిది. అది కోడలికైనా.. అల్లుడికైనా. కానీ.. అలాంటి అత్త‌నే ప్రేమించి... ఆపై పెళ్లి కూడా చేసుకుంటే.. క‌లికాలం కాక మ‌రేమిటి?

విష‌యంలోకివెళ్తే.. బిహార్‌లోని ఓ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేసుకుంటున్న సికింద‌ర్ యాద‌వ్‌కు 20 ఏళ్ల కింద‌టే పెళ్ల‌యింది. ఈయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు. అయితే.. ఇటీవ‌ల భార్య ఓ రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయింది. దీంతో ఇద్ద‌రు పిల్ల‌లు చిన్న‌వారు కావ‌డంతో అత్త‌గారింటికి మ‌కాం మార్చాడు. ప‌క్క‌ప‌క్క గ‌దుల్లోనే.. అత్త‌మామ‌, సికింద‌ర్‌లు ఉంటున్నారు. మ‌రి ఏం జ‌రిగిందో ఏమో.. అత్త‌పై అల్లుడు క‌న్నేశాడు. ఆమెను లోబ‌రుచుకున్నాడు.

ఈ క్ర‌మంలో వ‌య‌సులో ప‌దేళ్లు పెద్దదైన అత్త.. గీతా దేవి అయినా.. అల్లుడి వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టి.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించి ఉండాలి. కానీ, ఆమె కూడా.. అల్లుడి మోజులో ప‌డిపోయింది. ఇరువురూ... అనేక సార్లు.. మామ లేని స‌మ‌యంలో ఒంట‌రిగా గ‌డిపారు. ఇది ఆ నోటా ఈనోటా.. మామ‌.. దిల్లీశ్వ‌ర్ యాద‌వ్‌కు తెలిసిపోయింది. ఓ రోజు నిఘా పెట్టాడు. ఇద్ద‌రూ ఏకాంతంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో ఇంటికి తాళం పెట్టి.. చుట్టు ప‌క్క‌ల ఉన్న వారిని పిలుచుకువ‌చ్చి.. తతంగాన్నిచూపించి.. యాగీ చేశాడు.

అక్క‌డితో అయినా.. అత్త‌-అల్లుడికి బుద్ది వ‌స్తుంద‌ని పాపం దిల్లీశ్వ‌ర్ యాద‌వ్ అనుకుని ఉంటాడు. కానీ, బండారం బ‌ట్ట‌బ‌య‌లైన త‌ర్వాత‌.. ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నామ‌ని .. గ్రామ స్థుల ముందే.. ఒప్పేసుకున్నారు. అంతేకాదు.. అల్లుడు తాళి క‌డితే.. తాను పెళ్లి చేసుకుంటాన‌ని.. ఏమాత్రం బిడియం లేకుండా అత్త గీతా దేవి చెప్పేసింది. దీంతో సిగ్గుపోయిన దిల్లీశ్వ‌ర్ యాదవ్ అక్క‌డి నుంచి వెళ్లిపోగా.. వారిద్ద‌రూ నేరుగా వెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లిచేసుకున్నారు.

ఈ క్రమంలో గీత చెప్పింది వింటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ''నిజ‌మే అల్లుడిని పెళ్లిచేసుకోకూడ‌ద‌ని అంటారు. కానీ, మా అల్లుడు నెలకు రెండు ల‌క్ష‌లు సంపాయిస్తున్నాడు. వేరే వ్య‌క్తిని చేసుకుంటే.. ఆ డ‌బ్బులు మా మ‌న‌వ‌ళ్ల‌కు రాదుక‌దా. అందుకే.. త్యాగం చేశాను. మా ఆయ‌న‌ను ఒప్పిస్తాను'' అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఏమ‌నుకున్నారో.. ఏమో.. ఇద్ద‌రూ.. అక్క‌డి నుంచి పిల్ల‌ల‌ను తీసుకుని.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. మ‌రి ఇది స‌భ్య‌స‌మాజానికి ఎలాంటి మేసేజ్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News