విమాన ప్రమాదంలో భారత బిలియనీర్ మృతి!
బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన "రియోజిం" యజమాని... హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు.
విమాన ప్రమాదం... జరగకూడదు, జరిగితే ఎవరినీ మిగలనీయదు! అందరినీ కాలగర్భంలో కలిపేస్తుంది!! తాజాగా విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. అతనితో పాటు ఆయన కుమారుడితో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఈ దారుణం సెప్టెంబర్ 29న జరిగినా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అవును... ఆఫ్రికా దేశం జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన "రియోజిం" యజమాని... హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు. జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో వీరి ప్రైవేట్ విమానం కూలిపోయింది.
దీంతో ఆ సమయంలో ఈయనతోపాటు ప్రయాణిస్తున్న ఇతని కుమారుడు అమెర్(22)తో సహా ఆరుగురు మరణించారు. రియోజిం కి చెందిన సెస్నా 206 విమానం జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనులకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మసావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ విషయాలపై స్పందించిన జింబాంబ్వే ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... చనిపోయిన వారిలో నలుగురు విదేశీయులు కాగా.. మిగిలిన ఇద్దరు జింబాబ్వేకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. దీంతో... ఈ నివేదికను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్య పత్రిక హెరాల్డ్ వెల్లడించింది. సెప్టెంబర్ 29 ఉదయం 7:30 - 8:00 గంటల ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో రాంధవా స్నేహితుడు, హోప్ వెల్ చినోనో తన ట్విట్టర్ ఖాతాలో అతని మరణానికి సంతాపం తెలుపుతూ ధృవీకరించారు. జ్విషావనే లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన రియో జిం యజమాని హర్పాల్ రాంధావా మరణించినందుకు తానూ చాలా ఆవేదనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అతని కొడుకుతో సహా మరో 5 మంది కూడా ప్రమాదంలో మరణించారని వెల్లడించారు.