ఢిల్లీలో బీజేపీ గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ ?
బీజేపీకి ఇపుడు కళ్ల ముందు ఉన్న భారీ లక్ష్యం ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతున్నాయి.
బీజేపీకి ఇపుడు కళ్ల ముందు ఉన్న భారీ లక్ష్యం ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతున్నాయి. మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు 8వ తేదీన వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి చివరిసారి గెలిచింది 1993లోనే అంటే మూడు దశాబ్దాలకు పైగా ఢిల్లీలో గెలుపు రుచిని బీజేపీ ఆస్వాదించలేదు అన్న మాట.
దాంతో ఒక వైపు విజయం కోసం పట్టుదల గెలిచి తీరాలన్న కసితో బీజేపీ ఈసారి గెలుపే మాది అంటోంది. బీజేపీ ధీమాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆప్ అన్న పార్టీ 2013 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే ఐదవసారి పీఠం ఎక్కి రికర్డు క్రియేట్ చేయనున్నారు.
కానీ గతంలో ఉన్న ఇమేజ్ అయితే ఈసారి అరవింద్ కి లేదని అంటున్నారు. ఆయనను పన్నెండేళ్ళుగా ప్రజలు చూసారు. తమదైన తీర్పుని ఆయనకు అనుకూలంగా చాలా సార్లు ఇచ్చారు. ఈసారి గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మార్పు కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటు గతంలో మాదిరిగా ఆప్ లో ఐక్యత లేదు. సీనియర్లు కూడా కొందరు దూరంగా ఉన్నారు. పార్టీలో వర్గ పోరు సాగుతోంది.
ఇవన్నీ తట్టుకుని కేజ్రీవాల్ ఒంటి చేత్తొ పోరాడి గెలిస్తే మాత్రం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో మైలు రాయిని దాటినట్లే అంటున్నారు. కేజ్రీవాల్ ఇమేజ్ తగ్గడం ఆప్ మునుపటిలా లేకపోవడం ప్రజలలో మార్పు కోసం తపించడం వంటివి తమకు కలసి వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది.
ఇక మరో వైపు చూస్తే ఢిల్లీలో చూస్తే ఒక విధంగా ట్రయాంగిల్ ఫైటింగ్ అని చెప్పాలి. ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆప్ తో ఢీ కొడుతోంది. కాంగ్రెస్ ఢిల్లీని 1998 నుంచి 2013 దాకా అంటేఅ ఏకంగా పదిహేనేళ్ళ పాటు పాలించింది. దాంతో కాంగ్రెస్ కి కూడా కొన్ని సెగ్మెంట్లలో బలం ఉంది. ఓటు బ్యాంక్ కూడా ఉంది.
దాంతో ఈ త్రిముఖ పోటీ వల్ల ఆప్ ఓట్లు చీలిపోయి తమకు విజయావకాశాలు బాగా పెరుగుతాయని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. ఢిల్లీలో తాము బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నామని అపుడే బీజేపీ పెద్దలు గొప్పగా చెబుతున్నారు. బీజేపీ అనుకున్నట్లుగా ఢిల్లీలో గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు.
ముఖ్యంగా పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం అలగే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆమోదించడంతో పాటు రాజకీయంగా దూకుడు పెంచుతుందని అంటున్నారు. ఆ దూకుడుతో ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లోనూ మరోమారు సక్సెస్ కొట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందని 2026లో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తుందని విపక్షాల వ్యూహాలకు అందనంత విధంగా పకడ్బందీ వ్యూహంతో వారిని చక్రబంధం చేస్తుందని అంటున్నారు.
అంతే కాదు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని ఏపీ పాలిటిక్స్ లో కూడా బీజేపీ సరికొత్త జోరుని చూపించబోతుందని అంటున్నారు. సో అన్నింటికీ ఢిల్లీయే కీలకం కాబట్టి ఫిబ్రవరి 8న ఫలితాలు ఎలా వస్తాయి అన్నది వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.