ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం...?
దాని కంటే తొలి మహిళా సీఎం గా సుష్మా స్వరాజ్ బీజేపీ జమానాలో దాదాపుగా రెండు నెలల పాటు పనిచేశారు.
ఢిల్లీకి ఆప్ తరఫున మహిళా సీఎం గా అతిషీ కొద్ది నెలల పాటు పాలించారు. అంతకు ముందు పదిహేనేళ్ళ పాటు కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎం గా పనిచేసి సుదీర్ఘ కాలం ఒక మహిళ ఢిల్లీ ఏలిన రికార్డుని సొంతం చేసుకున్నారు. దాని కంటే తొలి మహిళా సీఎం గా సుష్మా స్వరాజ్ బీజేపీ జమానాలో దాదాపుగా రెండు నెలల పాటు పనిచేశారు.
ఇపుడు అదే బీజేపీ నుంచి మరో మహిళా నాయకురాలికి సీఎం పదవి ఇస్తారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపిక ఎపుడూ వైవిధ్యంగానే ఉంటుంది. అది హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిషాలలో నిరూపణ అయింది. ఇపుడు ఢిల్లీలో కూడా అలాంటి ప్రయోగం చేయబోతోంది అని అంటున్నారు.
బీజేపీ నుంచి ఎంతో మంది ఆశావహులు యోధానుయోధులు సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వేళా మహిళా సీఎం తో బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతోంది అని అంటున్నారు. ఇక బీజేపీ మహిళా సీఎం అన్న ప్రచారం తరువాత రేసులో చాలా పేర్లు ఉన్నాయి. అవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ జాబితా చూస్తే కనుక సీనియర్ నాయకురాలు, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఏబీవీపీ నుంచి ఆ పార్టీలో ఎదిగిన రేఖా గుప్తా ఈ రెసులో అగ్ర భాగాన ఉన్నారని అంటున్నారు. అదే విధంగా శిఖరాయ్ అనే మరో మహిళా నాయకురాలి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక చూస్తే బీజేపీ ఈసారి మహిళాలతో పాటు దళితులకు కూడా కేబినెట్ లో పెద్ద పీట వేస్తుంది అని అంటున్నారు. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవులు ఈ వర్గాలకు పెద్ద సంఖ్యలో ఇస్తారని అంటున్నారు.
బీజేపీ కనుక ఈ రకమైన ఆలోచన చేస్తే అది విపక్షాలకు షాకింగ్ గానే ఉంటుంది అని అంటున్నారు. ఎందుచేతనంటే బీజేపీ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ తో ఢిల్లీలో శాశ్వతమైన ముద్రను వేసుకోవడం అధికారాన్ని పది కాలాల పాటు నిలుపుకోవాలన్న వ్యూహం ఉందని అంటున్నారు.
అంతే కాదు మహిళా నేతలకు పగ్గాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది విద్యావంతులు మధ్యతరగతి సంపన్న వర్గాలు ఉన్న ఢిల్లీలో వారి మన్ననలు అందుకోవాలన్న తపన ఉంది. అంతే కాదు బీజేపీ అంటే డిఫరెంట్ పార్టీ అన్నది కూడా జనంలో చర్చకు పెట్టబోతున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి ఫ్రెష్ లుక్ తో బీజేపీ కొత్త కేబినెట్ ఉండబోతోంది అని అంటున్నారు. అంతే కాకుండా బీజేపీ ఈసారి గతంలోని తప్పులను పునరావృత్తం చేయకుండా సఫ్య దిశలో సాఫీగా పాలన సాగించాలని చూస్తోంది. సో ఢిల్లీకి మహిళా సీఎం అయితే ఆమె నాలుగవ లేడీ సీఎం గా ఆ రాష్ట్ర చరిత్రలో నిలుస్తారు అని అంటున్నారు.