అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు - జనసేన ఎమ్మెల్యే
అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు మరింత చెలరేగాయి.
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య పెరుగుతున్న విభేదాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి ఒక వైపు, వైసిపి మరో వైపు ఉన్న సమయంలో జరిగిన ఈ సంఘటనకు ఇంకా ముగింపు కార్డు పడలేదు. అత్యంత కీలకమైన సమయంలో వైసిపి ఎమ్మెల్యేకు అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు మరింత చెలరేగాయి.
ఇక ఆ గొడవకు రకరకాల పరిణామాలు ఉదాహరణగా నిలువగా ఆ విషయంలో ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ వివాదం మధ్య జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా? అనే ప్రశ్న లేవనెత్తారు.
"నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి మెగా ఫ్యాన్సే ఉన్నారు. లేదంటే ఎవరైనా మెగా కుటుంబం నుంచి విడిపోయి బ్రాంచీలుగాని షామియానా కంపెనీల తరహాలో ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నది మాత్రం మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతేతప్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారనే విషయం నాకు తెలియదు. ఇక ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నాడేమో మరి స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అలాగే చిరంజీవి గారి అభిమానులు అందరూ నీలో చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీలో. పవన్ కళ్యాణ్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు కూడా వారిలో నిన్ను చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పుడింగిని నాకు ఇష్టమైతేనే వస్తా అంటే వద్దు వెళ్ళిపో. ఎవడికి కావాలి? నిన్నేమైనా రమ్మని మేము అడిగామా? నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? 21 చోట్ల నిలబడితే 21 మేము గెలిచాము.
నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. మీ నాన్ననే ఎంపీగా నిలబెడితే నువ్వు గెలవలేదు. నువ్వు, అందరినీ విమర్శించడం కరెక్ట్ కాదు అని.. శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది అభిమానులు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొంత మంది అవి నిజమేనని వాదిస్తున్నారు. ఇకపోతే, అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య ఈ విభేదాలు ఎంతకాలం కొనసాగుతాయో చూడాలి.