స్టేడియంలో బిగ్ స్క్రీన్ పై బుడ్డోడు రిపీట్... వీడియో వైరల్!

సోషల్ మీడియా ప్రపంచం వచ్చాక ట్రోల్స్, మీమ్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-13 23:30 GMT

సోషల్ మీడియా ప్రపంచం వచ్చాక ట్రోల్స్, మీమ్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఎంత ఫన్ ఉంటే అవి అంత వైరల్ అవుతుంటాయి. ఈ ఫన్నీ వీడియోలే మీమర్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ క్రమంలో పదేళ్ల క్రితం నుంచి ఇప్పటివరకూ ట్రెండింగ్ జాబితాలో ఒకటిగా ఉన్న ఓ వీడియోలో బుడ్డోడు మరోసారి హల్ చల్ చేస్తున్నాడు.

అవును... గతంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఒకటి జరుగుతున్నప్పుడు ఓ ఫన్నీ వీడియో తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా స్టేడియంలో ఉన్న బిగ్ స్క్రీన్ పై ఒ కుర్రాడు సందడి చేశాడు. ఇందులో భాగంగా... గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఓ బుడ్డొడు ఆ టీషర్ట్ పైకి ఎత్తి, నాలుక బయటపెట్టి చేసిన డ్యాన్స్ వీడియో అక్కడున్న బిగ్ స్క్రీన్ పైనే కాదు.. నెట్టింటా వైరల్ గా మారింది.

నాడు ఆ బుడ్డోడు పూనకం వచ్చినట్లు ఊగిన వీడియో నాటి నుంచి నేటి వరకూ వైరల్ అవుతూనే ఉంది. మీమర్స్ కి అది అద్భుతంగా ఉపయోగపడింది. వాస్తవానికి ఈ వీడియో ఘటన 2013లో జరిగింది. అయితే... ప్రస్తుతం ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వయసులో అతడి వీడియో తెరపైకి వచ్చింది. మరోసారి వైరల్ గా మారింది.

2013లో నాడు ఫుట్ బాల్ మ్యాచ్ లో సందడి చేసిన ఆ బుడ్డోడి వీడియో ఇప్పటికీ వైరల్ గానే హల్ చల్ చేస్తున్న వేళ... ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడో చెప్పే ఓ వీడియో తెరపైకి వచ్చింది. తాజాగా అతడు నాడు వేసిన అదే స్టేప్, అదే ఎక్స్ ప్రెషన్స్ తో మరోసారి వదిలాడు! ఇప్పుడు "నాడు - నేడు" అంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తుంది.

అప్పట్లో ఈ బుడ్డోడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పక్కనున్న వారు ఎలా స్టేడియంలో సందడి చేశారో... ఇప్పుడు కూడా అతడి పక్కన కూర్చుని అదే ఎక్స్ ప్రెషన్స్ తో సందడి చేశారు. ఇప్పుడు ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. మీరూ లో కుక్కేయండి!

Tags:    

Similar News