జగదీష్ రెడ్డి వర్సెస్ మార్షల్స్.. అసెంబ్లీ వద్ద రగడ!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. తాజాగా సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. తాజాగా సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే సభ ప్రారంభమైంది. అయితే.. జగదీష్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదని.. కాబట్టి సభకు రావద్దని వారు తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జగదీష్‌రెడ్డి మార్షల్స్‌పై నిప్పులు చెరిగారు. ``నన్ను రావద్దని అనడానికి మీరెవరు? `` అంటూ ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఆర్డర్స్ ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.
దీంతో అటు మార్షల్స్‌కు, ఇటు ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనం తరం.. జగదీష్‌రెడ్డి మీడియా పాయింట్ వద్దకు వచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం, అసెంబ్లీ నడుస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. తనను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని.. తనను సస్పెండ్ చేశామని చెబుతున్న స్పీకర్.. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. తనపై సస్పెండ్ వేటు వేశారని.. కాంగ్రెస్ నాయకులే ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి.. తనను సభలో అడుగు పెట్టనివ్వడం లేదన్నారు. దీనిపై కోర్టులో తేల్చుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్నారు. సభను వారు(కాంగ్రెస్) ఇష్టానుసారంగా నిర్వహిస్తు న్నారని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు. విపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. అందుకే సభలో ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేశారని ఆక్షేపించారు. తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి రాజ్యాంగ నిబంధనలను పాటించకుండానే సభను నిర్వహిస్తున్నారని.. జగదీష్ రెడ్డి దుయ్యబ ట్టారు. ఇదిలావుంటే.. ప్రభుత్వ తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఇఫ్లార్ విందులకు కూడా మం త్రులు ప్రభుత్వ హెలికాప్టర్లను వినియోగించి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా.. కొన్ని రోజుల కిందట.. స్పీకర్ ప్రసాదరావును `ఏకవచనం`తో సంబోధించారన్న అభియోగంతో జగదీష్‌రెడ్డిని సభనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అది ఆ రోజుకే పరిమితమా? లేక.. ఈ నెల 27 వ తేదీ వరకు జరిగే సభల వరకు సస్పెండ్ చేశారా? అన్నది క్లారిటీ లేదు.