బీఆర్ ఎస్ తెచ్చుకోకపోగా.. 21 శాతం ఓట్లు పోయాయ్!!
నిజానికి ఏపీలో ఇప్పుడు వచ్చింది విప్లవం. ఇలాంటి సమయంలో వైసీపీ సీట్ల పరంగా తుడిచి పెట్టుకుపో యింది.
ఏ పార్టీ అయినా.. ఎన్నికల్లో అంతో ఇంతో లాభపడాలి. గత ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ దఫా.. ఎన్నిక ల్లో సీట్లలో అయినా.. ఓట్లలో అయినా లబ్ధి పొందాలి. పోనీ.. ఏదైనా కారణాలతో తెచ్చుకునేది లేకపోతే.. ఉన్న సీట్లను లేదా.. ఓటు బ్యాంకును అయినా.. కాపాడుకోవాలి. ఏపీలో ఇదే జరిగింది. సీట్లు పోయినా... వైసీపీ తన ఓటు బ్యాంకును చాలా వరకు కాపాడుకుంది. ఈ పార్టీకి ఆది నుంచి ఉన్న 40 శాతానికి పైగా ఓటు బ్యాంకును ఇప్పుడు కూడా నిలబెట్టుకుంది.
నిజానికి ఏపీలో ఇప్పుడు వచ్చింది విప్లవం. ఇలాంటి సమయంలో వైసీపీ సీట్ల పరంగా తుడిచి పెట్టుకుపో యింది. అయినప్పటికీ.. తన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓటుబ్యాంకును నిలబెట్టుకుంది. ఇదే ఆ పార్టీ నిలబడడానికి దోహదపడనుందనే వాదన వినిపిస్తోంది. ఇలా చూసుకుంటే.. తెలంగాణలో అసలు పార్లమెంటుకు ప్రాతినిధ్యమే కోల్పోయిన బీఆర్ ఎస్ విషయంలో కొత్తగా తెచ్చుకున్నది లేక పోగా.. ఉన్న ఓటు బ్యాంకును కూడా ఈ పార్టీ భారీగా కోల్పోంది. ఇది.. ఆ పార్టీ భవితవ్యానికి భారీ ఎఫెక్ట్‌గా మారింది.
తాజా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ మొత్తం 17 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా.. రాబట్టు కోలేక పోయింది. పైగా.. ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకుంది. గత ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకును బీఆర్ ఎస్ ఈ దఫా 16.68 శాతానికి పరిమితం చేసుకుంది. ఇది ఖచ్చితంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోందనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ..వచ్చిన బీఆర్ ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితం.. చెంప పెట్టు అనడంలో సందేహం లేదు.
ఇక, కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో 40.10 శాతం ఓట్ల షేర్‌తో దూసుకుపోయి.. 8741263 ఓట్లు దక్కించు కుంది. 8 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే.. బీజేపీ కూడా పుంజుకుని.. 35.08 శాతం ఓట్లు రాబట్టుకుంది. ఈ పార్టీకి 7647424 ఓట్లు దక్కాయి. అలానే 8 స్థానాలు కూడా దక్కాయి. ఇక, బీఆ్ ఎస్‌కు.. 16.68 శాతం ఓట్లు వచ్చినా.. ఒక్క సీటు కూడా దక్కలేదు. చిత్రం ఏంటంటే.. 3.09 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా.. ఎంఐఎం హైదరాబాద్‌ను నిలబెట్టుకుంది. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. బీఆర్ ఎస్ స్పష్టంగా ప్రమాదంలో ఉందనే విషయం తెలుస్తోంది.