కుప్పకూలిన విమానంలో మృత్యుంజయుడు... అదే ప్రాణాలు కాపాడింది!?

నేపాల్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే

Update: 2024-07-25 12:30 GMT

నేపాల్ లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 19 మంది ఉండగా.. 18మంది మృతిచెందారని, మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఒక్కరూ పైలెట్ కాగా.. ఆయనను మృత్యుంజయుడు అని అంటున్నారు!

త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కాఠ్ మండూ నుంచి పోఖారాకు బయలుదేరిన బంబార్డియర్ సీ.ఆర్.జే - 200 విమానం బుధవారం ఉదయం 11:11 గంటల సమయంలో టెకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో మృత్యుంజయుడైన పైలట్ ప్రాణాలతో ఎలా బయటపడ్డారనేది ఆసక్తిగా మరింది.

అవును... నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదం నుంచి పైలెట్ మనీష్ శౌక్య (37) ఒక్కరే వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే... ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఎలా సేవ్ అయ్యారనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఈ విమానం కూలిపోయే ముందు లోయకు పక్కనే ఉన్న ఓ కంటైనర్ ను బలంగా ఢీకొంది. దీంతో విమానంలో పైలెట్ ఉండే కాక్ పిట్ భాగం దానిలో చిక్కుకుపోయింది.

మిగిలిన భాగాలు మాత్రం పక్కనే ఉన్న కొండపై పడి అగ్ని కిలల్లో చిక్కుకుపోయాయి. అందులో ఉన్న 18 మంది ప్రయాణికులూ మృతి చెందారు. ఈ సమయంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బందికి... అక్కడున్న కంటైనర్ లో చిక్కుకున్న కాక్ పీట్ భాగం కనిపించింది. దాన్ని పరిశీలించగా.. అందులో పైలెట్ తీవ్రంగా గాయపడి, శరీరమంతా రక్తమోడుతూ సజీవంగానే ఉన్నారు.

దీంతో అతడిని బయటకు తీసి.. కాఠ్ మండూ మెడికల్ కాలేజీకి పంపించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుతోంది. కాగా... 2014 డిసెంబర్ లో విమానయాన సంస్థలో చేరిన మనీష్ శౌక్య... శౌర్య ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ విభాగం చీఫ్ గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News