కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు... ఆకాంక్ష ఇదే!

ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు... కేసీఆర్ ని కలిశారు. యశోద హాస్పటల్ లో కేసీఆర్ ను పరామర్శించారు.

Update: 2023-12-11 12:29 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తుంటిమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనను ఆదివారం... తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు... కేసీఆర్ ని కలిశారు. యశోద హాస్పటల్ లో కేసీఆర్ ను పరామర్శించారు.

అవును... నిన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను పరామర్శించగా, ఈ రోజు చంద్రబాబు పరామర్శించారు. ఇదే సమయంలో ఈరోజు చంద్రబాబు కంటే ముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. యశోద ఆస్పత్రిలో కేసీఅర్ ను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబుకు సిబ్బందితో పాటు నాయకులు స్వాగతం పలికారు. తనను పరామర్శించడానికి వచ్చిన వారందరితోనూ కేసీఆర్ చాలా సమయం మాట్లాడుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... కేసీఆర్ ను పరామర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడితే... ఆయన నార్మల్ గా నడవడానికి కనీసం 6 వారాలు పడుతుందని చెప్పారని బాబు అన్నారు. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వడం సహజం అని తెలిపారు. .ఈ సందర్భంగా కేసీఆర్ తొందరగా కోలుకుని, ప్రజాసేవలో ముందుకుపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

కాగా... ఎర్రవల్లి నివాసంలోని బాత్‌ రూంలో కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా కేసీఆర్ ను పరామర్శించడానికి వస్తున్నారు నేతలు!

Tags:    

Similar News