ఇటు చంద్రబాబు - అటు మోడీ.. వీరి రికార్డులు అన్‌స్టాపబుల్...!
ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. కాకపోతే కొన్ని నెలలు తేడా..! ఇద్దరూ రాజకీయంగా అనేక మెట్లు ఎక్కిన వారే.
ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. కాకపోతే కొన్ని నెలలు తేడా..! ఇద్దరూ రాజకీయంగా అనేక మెట్లు ఎక్కిన వారే. అనేక ఇబ్బందులు ఎదిరించిన వారే. అంతేకాదు.. ఇద్దరూ సమస్యలను సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగిన వారే. వారే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ. వీరిద్దరూ అనితర సాధ్యులు ! దేశ రాజకీయ చిత్ర పటంలో ఇద్దరు నాయకులు ఈ తరహా రాజకీయాలు చేసిన చరిత్ర వీరితోనే ప్రారంభ మవుతుందనడంలో సందేహం లేదు. వీరితోనే ముగిసినా ఆశ్చర్యం లేదు.
మంగళవారం (సెప్టెంబరు 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశం మొ త్తం మోడీ స్మరణలో మునిగిపోయింది. అయితే.. ఇదే వయసున్న ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా ఈ రోజు యాదృచ్ఛికంగా జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీనికి కారణంగా గుజరాత్‌లో జరుగు తున్న పునరుత్పాదక ఇంధన వనరుల సమ్మేళనంలో సోమవారం సీఎం చంద్రబాబు చేసిన అద్భుత ప్రసంగమే. ఈ ప్రసంగాన్ని యథాతథంగా గుజరాత్ సహా జాతీయ మీడియా ప్రచురించింది.
అయితే.. ఇటు ప్రధాని.. అటు సీఎంల జోష్ నేపథ్యంలో ఇరువురునేతల అభిమానులు కూడా.. వారి రాజీకీయ ప్రస్థానాలను స్మరించుకుంటున్నారు. మోడీ విషయానికి వస్తే.. అనేక ఇబ్బందులు .. అనే మరకలు.. మచ్చలను దాటుకుని 2000-2001 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు విషయానికి వస్తే.. 1995-96 మధ్య ఒక అనూహ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు వరుసగా రెండు సార్లు అధికారంలోకి వస్తే.. మూడు సార్లు మోడీ సీఎం అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబుకు ఒకదఫా ప్రదాని అయ్యే అవకాశం కూడా వచ్చింది. కానీ, ఆయనే వదులుకు న్న విషయం తెలిసిందే. మోడీకి మాత్రం విధిలేని పరిస్థితిలో బీజేపీ నుంచి ప్రధాని ఆఫర్ వచ్చింది. రెండుమూడు నెలల తర్వాత మార్చేయాలని అనుకున్న బీజేపీ అగ్రనాయకత్వం మూడుదఫాలుగా ఆయననే కొనసాగించింది. ఇక, ఏపీలో టీడీపీ వస్తుందో రాదో అని అనుకున్న సమయంలోచంద్రబాబు విశ్వరూపం ప్రదర్శించారు. ఫలితంగా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇలా.. కొన్ని సారూపత్యలు ఉన్నాయి. ఇక, ఇద్దరూ విజనరీ లీడర్లే కావడం గమనార్హం. ఇద్దరూ భవిష్యత్ దార్శనికులే కావడం మరింత విశేషం. సో.. ఇటు చంద్రబాబు-అటు మోడీ.. వీరి రికార్డులు అనితర సాధ్యం!!