హైదరాబాద్ ని బాబు క్రియేట్ చేయలేదు !
హైదరాబాద్ ని తానే క్రియేట్ చేశాను అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం సందర్భంగా చెప్పుకున్నారు.
హైదరాబాద్ ని తానే క్రియేట్ చేశాను అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం సందర్భంగా చెప్పుకున్నారు. హైదరాబాద్ తెలుగు జాతి అందరిదీ అని కూడా అన్నారు. ఈ రెండవ మాట విషయంలో ఆయనతో ఏకీభవించినా తానే హైదరాబాద్ ని క్రియేట్ చేశాను అని బాబు చెప్పడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది.
బాబు ఏ ఉద్దేశ్యంలో అలా అన్నారో తెలియదు కానీ హైదరాబాద్ చరిత్ర ఏకంగా నాలుగు వందల ఏళ్ళ పై చిలుకు ఉంది. హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చింది. హైదరాబాద్ ఎదుగుదలలో అందరి పాత్ర ఉంది. హైదరాబాద్ అన్నది భౌగోళికంగా ఇతరత్రా కూడా తన సొంత విశిష్టతను కలిగి ఉంది.
అంతే కాదు జనాలకు ఆకట్టుకునే గుణం ఈ విశ్వ నగరానికి ఉంది. హైదరాబాద్ గొప్పతనం ఏమిటి అంటే అక్కడ పేదవారు పెద్దవారూ ఇద్దరూ కలసి బతకగలరు, హైదరాబాద్ వచ్చిన వారు ఉద్యోగానికి ఉపాధికి ఏ మాత్రం బెంగ పడాల్సినది లేదు. వారి స్థాయికి తగిన ఉపాధిని ఇచ్చి పొట్ట నింపుతుంది. అలా హైదరాబాద్ లో కోటి మందికి పైగా జనాభా బతుకుతున్నారు.
హైదరాబాద్ లో మంచి వాతావరణం ఉంది. అది ప్రజలు అహ్లాదంగా నివసించ తగినది. అంతే కాదు అక్కడ ప్రజలు మంచి వారు అన్న పేరు ఉంది. హైదరాబాద్ దక్షిణాదిన ఒక కీలక స్థానంలో ఉంది. ఇలా ఎన్నో అనుకూల అంశాలు హైదరాబాద్ ని ఈ రోజున దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన 1995లో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన తొమ్మిదేళ్ళ పాలనలో హైదరాబాద్ కి అత్యధిక ప్రయారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ని ఆయన తనదైన శైలిలో అభివృద్ధి చేశారు. ఆనాడు సైబరాబాద్ వంటిది బాబు హయాంలోనే జరిగింది.
ఈ విధంగా చూస్తే హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఉందని బాబు చెప్పుకోగలరు. అయితే అదే సమయంలో ఆయన హైదరాబాద్ ని క్రియేట్ చేశాను అని మాత్రం ఆయన ఎలా చెప్పగలుగుతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు ఆ విధంగా చెబితే అది అతి పెద్ద రాజకీయ చర్చకు కూడా దారి తీస్తుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే చంద్రబాబు అమరావతిని దేశంలోనే నంబర్ వన్ సిటీగా అభివృద్ధిగా చేయాలని చూస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. ఆ విషయంలో ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. రేపటి రోజున అమరావతి కనుక అనుకున్న విధంగా అన్ని హంగులతో సిద్ధం అయితే ఆ క్రెడిట్ కచ్చితంగా చంద్రబాబుకు వెళ్తుంది అని అంటున్నారు.
ఇక తెలుగు జాతి అందరిదీ హైదరాబాద్ అన్న బాబు ఆలోచనలతో అంతా ఏకీభవిస్తున్నారు. హైదారాబాద్ అభివృద్ధిలో ప్రగతిలో ఈ స్థాయికి రావడంలో తెలుగు వారి కృషి ఎంతో ఉంది. అంతే కాదు హైదారాబాద్ ని ఒక వైపు విశ్వనగరం అంటూ అందరికీ చోటిస్తున్న వేళ అది మా ఒక్కరిదే అని ఎవరైనా క్లెయిం చేసుకున్నా సబబు కాదని అంటున్నారు. తెలుగు వారికి అది ఒక ఆస్తిగా చూడాల్సిన అవసరం ఉంది. అంతే కాదు హైదరాబాద్ విషయంలో ఆంధ్రులకు అరవై ఏళ్ళకు పైగా బంధం ఉంది.
అది ఎంతో భావోద్వేగానికి సంబంధించినది. అందువల్ల హైదరాబాద్ విషయంలో అందరికీ ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంది. బాబు ఈ విషయాలను కూడా చెప్పారు. ఏది ఏమైనా హైదరాబాబు ఇపుడు భౌగోళికంగా తెలంగాణా స్టేట్ లో ఉంది. దానికి రాజధానిగా ఉంది.
హైదరాబాద్ కి ఎంత చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకున్నా అది గత కాలం వైభోగమే అవుతుంది. అందువల్ల ఆయన అమరావతి రాజధాని విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టి దాని గురించి చెప్పుకుంటే ఆయన కృషికి ఆయన కీర్తికి శాశ్వతత్వం లభిస్తుంది అని అంటున్నారు.
అంతే కాకుండా హైదరాబాద్ ని ఎంతసేపూ చెబుతూ పోతూంటే బాబు గతంలోనే ఉండిపోతారు కానీ వర్తమానంలో ఏపీ ప్రజలు దాని గురించి పట్టించుకునేది ఉండదని అంటున్నారు. ఆ పొలిటికల్ మైలేజ్ ఏదీ తెలంగాణాలో రాదు, ఏపీలో అది కుదరదు. సో ఇలాంటి ప్రకటనలకు బాబు గారు బ్రేకులు వేయడమే మంచిది అని అంటున్నారు.