'తల్లికి వందనం'.. డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళలు..ముఖ్యంగా విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `తల్లికి వందనం` పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది తల్లులు ఈ పథకం కింద అర్హులు? అనే విషయాలపై అధికారుల నుంచివివరాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ పథకం కోసం తల్లులు ఎదురు చూస్తున్నారని.. పలువురు మంత్రులు చెప్పినట్టు తెలిసింది.
ఈ పథకాన్ని అమలు చేయాలనితనకు కూడా ఉందని కానీ. ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదన్న విషయాన్ని మహిళలకు వివరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అయితే.. ఇప్పటికి ప్పుడు కాకుండా.. 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే.. డేట్ ఎప్పుడనేది కూడా ఇంపార్టెంటేనని.. మహిళా మంత్రులు ప్రస్తావించారు. వచ్చే విద్యాసంవత్సరం జూన్ నుంచి ప్రారంభమవుతుందని.. చంద్రబాబు తెలిపారు.
దీనిని బట్టి.. జూన్ లేదా జూలై నుంచి మాతృవందనం పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి.. గత రెండు వారాల కిందట తాను మీడియాతో మాట్లాడుతూ.. చేసిన ప్రకటనను ప్రస్తావించారు. మాతృవందనం పథకం కింద రూ.12 వేలు ఇస్తామని తాను చెప్పానని.. దీనిపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రాలేదని.. కాబట్టి రూ.12 వేలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. కానీ, దీనికి చంద్రబాబు విభేదించారు.
ఎన్నికలకు ముందు.. రూ.15 వేలు ఇస్తామని చెప్పామని ఎన్నికష్టాలు వచ్చినా.. ఆ మాటను నిలబెట్టుకుం దామని ఈ విషయంలో రాజీ పడితే.. ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు. అంతేకాకుండా.. మహిళలు కూడా ఆశ పెట్టుకున్న నేపథ్యంలో అలా చేయడం సరికాదని.. కొన్నిరోజులు ఆలస్యమైనా.. చెప్పిన మాట ప్రకారం.. మహిళలకు రూ.15 వేల చొప్పున ఇద్దమని స్పష్టం చేశారు.