పదిహేనేళ్ల బాబు - పవన్ పొత్తుకు పదిలమైన జాగ్రత్తలు.. !
`కలిసి కట్టుగా.. మరో పదిహేనేళ్లు ఉండాలని భావిస్తున్నాం!`- ఇదీ.. గత రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.
`కలిసి కట్టుగా.. మరో పదిహేనేళ్లు ఉండాలని భావిస్తున్నాం!`- ఇదీ.. గత రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి ఆయన గతంలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పుడు మరింత గట్టిగా తన వాదనను వినిపిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత.. కూటమి పార్టీల మధ్య వివాదాలు విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే.
అనంతపురంలో బీజేపీ వర్సెస్ టీడీపీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ వర్సెస్ జనసేన.. ఇలా పలు జిల్లాల్లో పరిస్థితి రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఏకంగా టీడీపీకి చెందిన కీలక నాయకుడిపైనే ఓ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా.. పవన్ కల్యాణ్.. తన పొత్తు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. నిజానికి ఈ ఆరు మాసాల్లో అనేక ఇబ్బందులు వచ్చాయి.
ఆయా సమయాల్లో పొత్తుపై నీలి నీడలుకమ్ముకున్నాయా? అన్న సందర్భాలు కూడా వచ్చాయి. అయితే.. ఎక్కడా కూడా గాడి తప్పకుండా పొత్తు రథం పదిలంగా ముందుకు సాగింది. ఇక, ఇప్పుడు టీటీడీ రూపం లో మరో పెద్ద విపత్తు వచ్చింది. చైర్మన్, ఈవోలు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ పట్టు బడుతున్నారు. దీనికి చైర్మన్ కొంత మేరకు దిగి వచ్చి ఓకే చెప్పినప్పటికీ ఈవో మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌లో ఆగ్రహం కట్టలు తెగుతోంది.
అయితే.. నేరుగా సీఎంకు లేదా.. పాలక మండలికి మాత్రమే ఈవో జవాబు దారీ కావడంతో ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు నేరుగా చేసేఅ వకాశం లేదు.మొత్తంగా చూస్తే.. ఈ ఏడు మాసాల్లోనే.. పొత్తు విషయం పై అనేక కుదుపులు వచ్చాయి. కానీ, పదిహేనేళ్లు ఉండాలని పవనేకోరుకుంటున్నారు. ఇలా ఉండాలం టే.. `స్వపక్షంలో విపక్షం`అన్నట్టుగా వ్యవహరించడం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదేసమయంలో సంయమనం పాటించాలి. ఈ రెండు లేకపోతే.. ఆశించిన ఫలితం దక్కతుందా? అనేది చూడాలి.