బిగ్ బ్రేకింగ్... జూలై 1న రూ.7000 పెన్షన్ పై క్లారిటీ!

ఇందులో భగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Update: 2024-06-24 08:09 GMT

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం చంద్రబాఉ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం ఈరోజు సమావేశమపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో పెన్షన్ పెంపు, పెన్షన్ ఏరియర్స్ విషయంలోనూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అవును... సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... పెన్షన్ పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ సందర్భంగా... రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచే నిర్ణయానికి ఆమొదం తెలిపారు.

ఇదే సమయంలో జూలై 1 నుంచి పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేయడంతోపాటు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలకు కలిపి ఒక్కొక్కరికీ రూ.7వేల పెన్షన్ ఇవ్వనున్నారు. వచ్చే నెల 1న పెంచిన పెన్షన్ ఇంటివద్దే అందజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.7వేల పెన్షన్ అందనుంది.

ఇదే సమయంలో... విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుండగా... డిసెంబర్ 10లోపు ఈ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మిగిలిన కీలక అంశాలపైనా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ అవసరం లేకుండా డీఎసీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News