శ్రీకృష్ణదేవరాయులకు కీలక బాధ్యతలు... సీబీఎన్ కీలక నిర్ణయం!
అవును... నరసరావుపేట నుంచి ఎన్నికైన టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయులు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి అదే నరసరావుపేట టిక్కెట్ సంపాదించారు. 1,59,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వాసాన్ని సంపాదించారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు. దీంతో కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు.
అవును... నరసరావుపేట నుంచి ఎన్నికైన టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయులును తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేతగా ఎంపిక చేశారు చంద్రబాబు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఈ 16 మంది ఎంపీల్లోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి మినహా మిగిలినవారంతా జూనియర్లనే చెప్పాలి! మరోపక్క రామ్మోహన్ నాయుడి రూపంలో అనుభవజ్ఞుడు ఉన్నప్పటికీ... ఆయనను మోడీ మంత్రివర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.
ఈ సమయంలో సమర్ధుడైన మరో యువనేతను ఎంపిక చేయాలనే బాబు భావించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నప్పటికీ... పార్లమెంటులో పార్టీ వైఖరిని సమర్థవంతంగా ప్రదర్శించగల యువనాయకుడిని బాబు కోరుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే... లావు శ్రీకృష్ణదేవారాయులును ఎంపిక చేశారని అంటున్నారు.
లోక్ సభలో టీడీపీ విప్ గా బాలయోగి కుమారుడు!:
ఇదే సమయంలో... లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి తనయుడైన హరీష్ మాథుర్ కీ చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ఈ యువ నాయకుడిని లోక్ సభలో టీడీపీ విప్ గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. కాగా... ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పై హరీష్ గెలిచిన సంగతి తెలిసిందే.