సర్వేల బాబు.. టీడీపీ నేతల గుస్సా..!
ఎన్నికలకు సమయం వచ్చేసింది.. నాయకులు కూడా రెడీ అయిపోయారు
ఎన్నికలకు సమయం వచ్చేసింది.. నాయకులు కూడా రెడీ అయిపోయారు. జాబితాలు ఎప్పుడెప్పుడా? అని ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. అధికార పార్టీ ఇంచార్జ్‌ల జాబితాలను వెల్ల డిస్తోంది. దీంతో రాజకీయంగా రాష్ట్రం వేడెక్కింది. ఇక, ఎత్తులు.. పై ఎత్తులతో దూసుకుపోవడమే తరువా యి.. అన్నట్టుగా పరిస్తితి మారిపోయింది. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు కూడా.. తమ జాబితాల కోసం ఎదురు చూస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడెప్పుడు జాబితాలు విడుదల చేస్తారా? అని చూస్తున్నారు. కానీ, పార్టీ వ్యూహం మాత్రం మరోలా ఉంది. రెండు దశల్లో వచ్చే పదిహేను రోజుల పాటు.. సర్వేలు చేసిన తర్వాతే.. అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై చంద్రబాబు కూడా సిగ్నల్స్ ఇచ్చారు. 'ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు' అని సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు.
అవి కూడా.. వంశపారంపర్యంగా వస్తున్న అభ్యర్థులు.. నియోజవకర్గాల్లో మార్పులు లేని అభ్యర్థులు వంటివారికే పరిమితం అవుతున్నారు. ఈ జాబితా తర్వాత.. మరో 10 రోజుల వరకు ఎలాంటి జాబితాలు ఉండబోవని చెబుతున్నారు. ఈలోగా 70 నుంచి 90 నియోజకవర్గాల్లో సర్వేలు చేయాలని నిర్ణయించారు. రెండు దశల్లో సాగే ఈ సర్వేలో అభ్యర్థులకు వచ్చిన మార్కులను బట్టి.. వారిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు నుంచి ముగ్గురు, కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ఒక్కొక్క చోట.. ఒక్క అభ్యర్థిపోటీకి రెడీగా ఉన్నారు. అయితే.. వీరి నుంచి ఎంపిక చేసేందుకు.. ఐవీఆర్ ఎస్ సర్వే తొలి దశలో చేపట్టనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా.. ప్రజల కుపోన్ చేసి.. అభ్యర్థుల పేర్లు చెప్పి... మీకు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారో.. వారి నెంబర్‌పై ప్రెస్ చేయాలని.. చెబుతారు. ఇలా.. మెజారిటీ వచ్చిన వచ్చిన వారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
రెండో దశ కూడా ఒకే సమయంలో చేపట్టనున్నారు. ఈ సర్వేలో.. టీడీపీ స్థానిక నాయకులు, వలంటీర్లు, సీబీఎన్ ఆర్మీ నేరుగా ప్రజలను కలుస్తాయి. వారి అభిప్రాయాలను నేరుగా పార్టీకి పంపిస్తాయి. దీనిని.. ఐవీఆర్ ఎస్ సర్వేతో జోడించి.. సరిచూసిన తర్వాత.. మెజారిటీ అభిప్రాయం ప్రకారం.. 70-90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయనన్నారు. అయితే.. ఈ విధానంపై తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తాము పార్టీ కోసం చేసింది పోయిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.