టీడీపీ గెలుపు మీద బాబు సంచలన కామెంట్స్ !
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం అన్నది చారిత్రక అవసరం అన్నారు.
తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో జట్టు కట్టింది ఏపీ క్షేమం కోసమే అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. 2014లో తమ కూటమి సూపర్ హిట్ అయిందని ఈసారి కూడా హిట్ అవడం ఖాయమని అన్నారు. కూటమి సభలకు వస్తున్న జనాలు వారి ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఎన్నికలు అన్నవి లాంచనమేనని వచ్చేది గెలిచేది టీడీపీ కూటమే అని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం అన్నది చారిత్రక అవసరం అన్నారు. సిద్ధం అంటూ జగన్ పిలుపుఇస్తున్నారని ఆయనకు మరచిపోలేని యుద్ధంతోనే జవాబు చెబుదామని చంద్రబాబు అన్నారు. ప్రజలు తలచుకుంటే ఎవరినా ఇంటికే అన్నారు. జగన్ కూడా తన ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రజలు ఓటు అనే ఆయుధంతో తిరుగులేని తీర్పు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రజల మధ్య వైష్యమాలు రేపడం జగన్ కి తమాషాగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. కోనసేమ పచ్చగా ఉంటే వైసీపీ నేతలు చూస్తూ ఉండలేక పోయారు అని ఆయన అన్నారు. అందుకే ఆరని మంటలను పెట్టారని రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలను ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు.
కోనసీమ సహా గోదావరి జిల్లాలు ఎపుడూ టీడీపీ కూటమికి కంచుకోటలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందని అన్ని సీట్లూ గెలిచామని ఈసారి కూడా అలాంటి పరిస్థితినే చూస్తున్నామని అన్నారు. తనను తన సామాజిక వర్గం వారి చేత బూతులు తిట్టించిన జగన్ పవన్ విషయంలోనూ అదే విధానం అనుసరిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
ఇదేమి రాజకీయ క్రీడ అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో అయిదేళ్ల పాలనతో ఏపీని తిరోగమనం దిశగా తీసుకెళ్ళిన జగన్ కి ఓటు వేయాలని ఎవరూ అనుకోరని ఆయన అన్నారు. ప్రజలలో ఈ రోజు అభద్రతాభావం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి చిరుద్యోగుల వరకూ ఆఖరుకు పోలీసు ఉద్యోగుల వరకూ అందరూ ఈ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు అన్నారు.
ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు హెచ్చరించారు. తాము జన సందోహంతో సభలు పెడుతూంటే వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని ఆయన అన్నారు. జగన్ కి తమ కూటమి ఎదురుగా నిలిచి గెలిచే సత్తా లేదని ఆయన అంటున్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమని వైసీపీ చరిత్రలోకే అంటూ బాబు హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన అన్నారు. బీసీల కోసం డిక్లరేషన్ రూపొందించామని అన్నారు. అలాగే కాపులలో పేదలు ఉన్నారని వారిని ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. సమాజంలో అందరూ బాగుండాలి అన్నదే టీడీపీ కూటమి నినాదం అని ఆయన అన్నారు.