రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి.

Update: 2023-09-10 07:04 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు కోర్టు బయట వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు బయట భారీ సంఖ్యలో వాహనాలు, భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు కారుకు ముందు వెనుక భారీ సంఖ్యలో వాహనాలు ఉండేలాగా కాన్వాయ్ ని పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అయితే, భద్రత కోసమే అని చెబుతున్నప్పటికీ ఏదో జరగబోతోంది అని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఒకవేళ చంద్రబాబును సిఐడి అధికారులు కోరినట్టుగా న్యాయమూర్తి రిమాండ్ కు ఇస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆ వాహనాలను భారీగా పోలీసులు మోహరించారని పుకార్లు వస్తున్నాయి. ఇక, ఆల్రెడీ విజయవాడ కోర్టు హాల్ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు దారులను, ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేయిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఆల్రెడీ కోర్టు దగ్గరున్న పోలీసులకు అదనంగా మరిన్ని అదనపు బలగాలను రప్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.

కోర్టుకు అర కిలోమీటర్ దూరం నుంచే వాహనాలను, వ్యక్తులను బారకేడ్లు పెట్టి పోలీసులు ఆపేస్తున్నారు. దీంతో, కోర్టుకు వచ్చే మిగతా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోర్టుకు దూరంగానే భారీ సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు రుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కోర్టులో వాదన జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో, చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.

Tags:    

Similar News