భారీ వర్షాలకు చెన్నైలో ధనవంతుల ముందు జాగ్రత్తలు ఇలా ఉన్నాయి!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-10-17 05:50 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీవర్షాలకు ప్రధానంగా బెంగళూరుతో పాటు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సుమారు 300 ప్రాంతాలు నీట మునిగినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే కొనసాగుతోన్న రెడ్ అలర్ట్ ను అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. చెన్నై జిల్లాతో పాటు చుట్టుపక్కలున్న మొత్తం 9 జిల్లాలకు, పుదుచ్చెరీకి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం వాయుకుండం చెన్నైకి ఉత్తరాన్న తీరందాటే అవకాశం ఉందని చెప్పడంతో.. ఈ లోపు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు.. తీరం దాటే సమయంలో వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని.. ఆ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ ఎఫెక్ట్ గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో చెన్నైలోని ధనవంతులు, ఐటీ ప్రొఫెషనల్స్ కుటుంబాలు కొన్ని విలాసవంతమైన హోటళ్లకు వెళ్తున్నారు!

అవును... బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకుల వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.

ఈ సమయంలో గతేడాది డిసెంబర్ లోలాగా ఇబ్బదిపడకుండా.. పలువురు ధనవంతులు విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్ చేసుకుని కుటుంబాలతో కలిసి దిగిపోతున్నారంట. ప్రధానంగా కరెంట్ సౌకర్యం, కార్ పార్కింగ్ తో పాటు వైఫై సౌకర్యం ఉన్న హోటళ్లకు షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు.

పలువురు వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న టెక్కీలు కూడా ఇదే ఆలోచన చేశారని.. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, వైఫై సౌకర్యం ఉన్న హోటళ్లకు వెళ్లి.. వారి ఉద్యోగానికి సమస్య రాకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది

Tags:    

Similar News