326 సీట్లకే పరిమితం: కాంగ్రెస్ త్యాగాలు.. గెలిపిస్తాయా?
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కేం ద్రంలో బలంగా ఉన్న బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపి.. పదేళ్ల ప్రతిపక్షపార్టీగా ఉన్న కాంగ్రె స్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే అనేక ఇబ్బందులు వచ్చినా.. ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొత్తం 543 స్థానాల్లో.. కేవలం 326 స్థానాలకే.. పోటీని పరిమితం చేయడం.. ఆశ్చర్యంగా ఉంది.
ఉదాహరణకు గత ఎన్నికల్లో 417 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. గెలిచింది ఎన్ని అనే విషయాన్ని పక్కన పెడితే.. పోటీ అయితే చేసింది. కానీ, ఈ సంఖ్యను దారుణంగా 326కు తగ్గించుకుని.. మిగిలిన 217 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేసి.. త్యాగాలు చేయడమే ఇప్పుడు చర్చగా మారింది. మరి ఈ త్యాగాలు ఏమేరకు పనిచేస్తాయి? ఏమేరకు కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
పొత్తుల ఎఫెక్ట్ కాంగ్రెస్‌పై బాగానే పడింది. దీనికి తోడు ఉత్తరాదిలో బీజేపీ ప్రభావం కూడా.. కాంగ్రెస్‌ను పోటీ నుంచి నిలువరించేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48), బిహార్ (40), తమిళనాడు (39)ల్లో మొత్తం 207 స్థానాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్ కేవలం 52 చోట్ల పోటీ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో డీఎంకేతో, బిహార్‌లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతోను, యూపీలో సమాజ్ వాదీ పార్టీతోనూ. పొత్తు పెట్టుకుంది. దీంతో వారు చెప్పినట్టే అక్కడ సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక, మొత్తంగా ఉన్న అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం కర్ణాటక(28), తెలంగాణ(17), పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కింతోపాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే దక్కింది. ఏపీలో కూడా మొత్తం స్థానాలకు పోటీ చేస్తుందా లేదా? అనేది చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ గత చరిత్రకు భిన్నంగా.. కేవలం 326 స్థానాలకే పరిమితం అయింది.