ఇన్నోవా ఈఎంఐల కోసం !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైఎస్ వర్దంతి సందర్భంగా 35 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ జీవోలు విడుదల చేసింది.

Update: 2024-07-09 10:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైఎస్ వర్దంతి సందర్భంగా 35 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ జీవోలు విడుదల చేసింది. అయితే ఈ జీఓలు మార్చ్ 15వ తేదీతో విడుదల కావడం చర్చకు దారితీసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో 35 మంది చైర్మన్ల పేర్లు బయటకు వచ్చాయి.

ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో జీఓలు విడుదల చేయడానికి ఆటంకం ఏర్పడింది. దీంతో తాజాగా పాత డేట్ మీద జీఓ ఇచ్చారు. ఇలా ఎలా ఇస్తారని మీడియా ఆరా తీయగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

శాసనసభ ఎన్నికల్లో అవకాశం రాని వారికి, గత పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అప్పట్లో పార్టీ హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు పదవులు గ్యారంటీ అనుకున్న వారు ఇన్నోవా, ఇతర వాహనాలను కొనుగోలు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పదవులు ఆగిపోవడంతో కొత్త వాహనాలకు ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ విషయాన్ని కొందరు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో పాత తేదీతో జీఓ ఇస్తే మూడు నెలల జీతాలు వస్తాయని పాత తేదీలో జీఓలు విడుదల చేశారు. దీంతో హమ్మయ్య ఈఎంఐల బాధ తీరినట్లేనని కొత్త చైర్మన్లు సంబర పడుతున్నారు.

Tags:    

Similar News