నోటాకి ఓటు వేయాలంటున్న కాంగ్రెస్!

అవును... లోక్ సభ ఎనికల వేళ రకరకాలా సిత్రాలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2024-05-07 07:46 GMT

లోక్‌ సభ ఎన్నికలలో పలు సిత్రాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల సూరత్ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. తాజాగా మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషన్‌ ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... లోక్ సభ ఎనికల వేళ రకరకాలా సిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... మే 13న ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్ లోక్‌ సభా స్థానంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి సుమారు 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో... కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన అక్షయ్ కాంతి బీజేపీలో చేరారు!

ఈ నేపథ్యంలో... అక్షయ్ కాంతి బీజేపీలో చేరారని మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కైలాష్ విజయవార్గియా ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ ఇండోర్ లోక్‌ సభ అభ్యర్థి అక్షయ్ కాంతి ని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడి శర్మాజీ నాయకత్వంలో బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీంతోపాటు అక్షయ్‌ కాంతితో ఆయన ఓ కారులో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ క్రమంలో... తమ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఆ నామినేషన్ ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన అక్షయ్ కాంతి పై నిప్పులు చెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఇండోర్ లో పోటీ చేయడానికి అవకాశం లేకపోవడంతో "నోటా"కు ఓటు వేయాలని సూచిస్తుంది.

Tags:    

Similar News