నమ్మిన బంటు చేతిలో బడా నేత బకరా! ఆ నేత ఎవరంటూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ డిబేట్
నాకు అధికారం రాని నీ పనిచెబుతానంటూ ఆ నేత పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం పోయిన రూ.వెయ్యి కోట్లు తలుచుకుంటూ బోరున ఏడుస్తున్నారట..
నమ్మిన వారినే మోసం చేస్తుంటారు. ఇలా మోసపోయేవారిలో సాధారణ పౌరులు చాలామంది ఉంటారు. కానీ, ప్రజలను మోసం చేయగలిగే నేతలను బకరా చేయాలంటే ఎంత దమ్ముండాలి. మాయలోడిని మోసం చేసే మహా మాయలోడు అయ్యండాలి. నిజమే తెలుగు రాష్ట్రాల్లో ఓ బడా నేతను నమ్మిన బంటే బకరా చేశాడట. ఏకంగా వెయ్యి కోట్లు ఎగవేసి, హలో.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే.. అంటూ సినిమా డైలాగులు వేస్తున్నాడట. నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? నాకు అధికారం రాని నీ పనిచెబుతానంటూ ఆ నేత పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం పోయిన రూ.వెయ్యి కోట్లు తలుచుకుంటూ బోరున ఏడుస్తున్నారట..
మోసగాళ్లకే మోసగాడిగా ఓ నేత సన్నిహితుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో చర్చకు అవకాశమిచ్చాడు. ఈ మోసంపై ప్రముఖ దినపత్రికలో సంచలన కథనం రావడంతో ఇరురాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మోసపోయిన ఆ నేత ఎవరంటూ అంతా ఆరా తీస్తున్నారు. అరబ్ దేశాల్లో వ్యాపారాలు చేసే ఓ వ్యాపార వేత్తకు తెలుగు రాష్ట్రాల్లోని బడా నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆ వ్యాపారవేత్తకు ఓ ప్రముఖ నేత రూ.వెయ్యి కోట్లు డబ్బులిచ్చాడట. ఆ నల్ల డబ్బును సదరు వ్యాపారవేత్త వ్యాపార అవసరాలకు వాడుకుని మళ్లీ తమకు అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వాలని, అదీ వైట్ గా సర్దుబాటు చేయాలనే కండీషనుతో ఇక్కడ సంపాదించిన డబ్బును దుబాయికి తరలించినట్లు సమాచారం. ఇలా గత పదేళ్లుగా సదరు వ్యాపార వేత్తతో ఆ ప్రముఖ నేత మంచి సంబంధాలు నెరిపారని సమాచారం. తొలుత వంద, రెండు వందల కోట్లతో మొదలైన ఈ లావాదేవీలు ఎన్నికలకు ముందు వెయ్యి కోట్లకు చేరిందని చెబుతున్నారు. అయితే వ్యాపారంలో లాసు వచ్చిందో? సదరు నేత అవసరం తీరిపోయిందనో ఆ వ్యాపార వేత్త తాజాగా ప్లేట్ ఫిరాయించాడట. రూ.వెయ్యి కోట్లను ఎగేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యర్థులతో చేతులు కలిపి నీకు, నాకు జట్టు పీస్ అంటూ హ్యాండిచ్చినట్లు చెబుతున్నారు.
డబ్బును తీసుకున్న వ్యాపారవేత్త గతంలో యూఏఈలో ఉండేవాడని, వెయ్యి కోట్లు అందిన తర్వాత చడీచప్పుడు చేయకుండా యూరప్ కు తన మకాం మార్చేశాడని ప్రచారం జరుగుతోంది. సన్నిహితుడని క్యాష్ ఇస్తే ఇలా హ్యాండిచ్చాడేంటి? పాలిటిక్స్ లో హ్యాండివ్వడం మాకు అలవాటైతే, అండర్ గ్రౌండ్ రిలేషన్ లోనూ అలాంటి షాకిస్తారా? అంటూ ఆ ముఖ్యనేత తన అంతరంగికుల వద్ద లబోదిబోమంటున్నాడని చెబుతున్నారు. తాను అధికారంలో ఉంటే ఆ వెయ్యి కోట్లు ఆఫ్ట్రాల్ అని అనుకుందునని, కానీ, ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఉండగా, గట్టి దెబ్బ వేశాడని వాపోతున్నాడట. ఇక ఇటీవల కాలంలో ఆ నేతకు ఇది రెండో దెబ్బ అని, ఇంతకుముందు కూడా ఓ వ్యక్తి ఇదే తరహా మోసం చేశాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి వరుసగా సన్నిహితుల చేతిలో మోసపోతున్న ఆ నేత నేను మరీ అంత బకరాలా కనిపిస్తున్నానా? అంటూ బిక్కముఖం వేస్తున్నాడని అంటున్నారు.