ఛీ.. ఛీ.. మార్చురీలో శవాల పక్కన “ఆ” పని... వీడియో వైరల్!
మార్చురీ అంటే అక్కడ ఏముంటాయి?.. శవాలు ఉంటాయి! అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్చురీలో కూడా స్ట్రెచ్చర్ పై ఓ శవం ఉంది.
మార్చురీ అంటే అక్కడ ఏముంటాయి?.. శవాలు ఉంటాయి! అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్చురీలో కూడా స్ట్రెచ్చర్ పై ఓ శవం ఉంది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో డాక్టర్, సూపర్ వైజర్ కూడా ఉంటారనేది తెలిసిన విషయమే! అయితే.. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో... ఇంతకు మించిన సువర్ణావకాశం, సదావకాశం మరొకటి ఉంటుందా అనుకున్నాడో ఏమో కానీ... అక్కడే క్రామ క్రీడకు తెరలేపాడు ఓ వ్యక్తి!
అవును... కామా తురాణాం నభయం న లజ్జ అని అన్నట్లుగా శవాల మధ్యలో ఏకాంత ప్రదేశాన్ని చుసుకున్నాడో వ్యక్తి. ఇంకేముందు మార్చురీలో ఎవరూ కనిపించకపోయే సరికి అక్కడకు తన ప్రియురాలిని పిలిచాడు. అనంతరం ఇద్దరూ కలిసి క్రా*మ క్రీడలో పాల్గొన్నారు. అయితే... ఆ సమయంలో పక్కనే శవం ఉంది అనే సోయ ఏమాత్రం లేకుండా చక్కగా పనికానించుకుని వెళ్లిపోయారు.
పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదు అనుకున్నట్లుగా... ఈ జంట కూడా తమను ఎవరూ చూడటం లేదు అని భావించినట్లుంది. కట్ చేస్తే వీరి "మార్చురీలో మకాం" అనే కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది!.. కాసేపట్లోనే వైరల్ గా మరిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నొయిడాలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన రెండు నెలల కిందట జరిగినట్లు చెబుతున్నారు!
ఇలా ఈ ఘటన వెలుగులోకి రావడంతో నొయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ శర్మ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారని అంటున్నారు. దీంతో... ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి మార్చురీలో పనిచేస్తున్న స్వీపర్ అని తేలిందంట. దీంతో... అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మహిళను ఇంకా గుర్తించలేదని అంటున్నారు. ఈ వీడియోను అక్కడే పనిచేసే క్లీనర్ పర్వేంద్ర వైరల్ చేసినట్లు తెలిపారు! ఈ నేపథ్యంలో సదరు స్వీపర్ ను ఆరోగ్య శాఖ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయంపై దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.