రేవంత్ కు నారాయణ మద్దతు !

రాష్ట్ర గీతం కంపోజ్ చేయానికి కీరవాణిని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెడితే తప్పేమిటి? అని నారాయణ ప్రశ్నించారు.

Update: 2024-05-31 12:52 GMT

‘జయ జయహే తెలంగాణను తెలంగాణ రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయం. అయితే తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిది. రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టిపెట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచనలు చేశారు.

రాష్ట్ర గీతం కంపోజ్ చేయానికి కీరవాణిని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెడితే తప్పేమిటి? అని నారాయణ ప్రశ్నించారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని, కళలకు హద్దులు గీయడం సరికాదని, ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని నారాయణ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ చిహ్నం మార్పు, రాష్ట్ర గీతం నేపథ్యంలో తెలంగాణలో విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శల నేపథ్యంలోనే పాటను ఆమోదించి, చిహ్నంపై నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. మరి సీపీఐ నారాయణ సూచనలు రేవంత్ ఎంత వరకు పాటిస్తాడో వేచిచూడాలి.

Tags:    

Similar News