నీళ్లు లేకుండా సాగు.. 2 నెలలు బతికేస్తాయంటున్న కుర్రాడు

సాగు చేయాలంటే నీళ్లు తప్పనిసరి. అదే పంట అయినప్పటికీ నీళ్లతోనే పంట పండించటం సాధ్యమవుతుంది

Update: 2023-09-27 05:34 GMT

సాగు చేయాలంటే నీళ్లు తప్పనిసరి. అదే పంట అయినప్పటికీ నీళ్లతోనే పంట పండించటం సాధ్యమవుతుంది. వర్షాభావంతో పంటలు ఎండిపోయి.. ఆ నష్టాన్ని తట్టుకోలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడటం తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నట్లుగా చెబుతున్నాడో కుర్రాడు. మహారాష్ట్రకు చెందిన ప్రకాశ్ సునీల్ పవార్ అనే యువకుడు తన పరిశోధనలతో వినూత్న విధానాన్ని కనుగొన్నారు.

తాను తయారు చేసిన ఆకుపచ్చని పేస్టు సాయంతో.. మొక్కలకు నీళ్ల అవసరం లేకుండా చేయొచ్చని చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోకుండా ఉండేందుకు తాను తయారు చేసిన మిశ్రమాన్ని మొక్కలకుపట్టిస్తే.. కనిష్ఠంగా 45 రోజులు గరిష్ఠంగా 60 రోజులు నీళ్ల అవసరం లేకుండా.. పంట ఎండిపోకుండా కాపాడుకోవచ్చన్న సంచలన విషయాన్ని చెబుతున్నాడు.

మొక్కజొన్నతో పాటు.. నీటిశాతం ఎక్కువగా ఉండే మరో పదార్థంతో తయారు చేసిన మిశ్రమాన్ని.. పేస్టు రూపంలో మొక్కల వేర్ల పైభాగంలోని మట్టిలో కలపాలని.. అలా చేయటం ద్వారా నీళ్ల అవసరం లేకుండా పంట ఎండిపోకుండా ఉంటుందని చెబుతున్నాడు. తాను కనుగొన్న ఆవిష్కరణకు ఇరవై ఏళ్ల పాటు పేటెంట్ పొందినట్లుగా చెబుతున్నాడు. మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాలోని బ్రాహ్మణ్ షెవ్ గే గ్రామానికి చెందిన ప్రకాశ్ సునీల్ పవార్ ఆవిష్కరణ అద్భుతమనే చెప్పాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News