గూగుల్ మ్యాప్ వల్ల వ్యక్తి మృతి... ఫ్యామిలీ కీలక నిర్ణయం!

అవును... నార్త్ కరోలినాకు చెందిన వైద్య పరికరాల విక్రయదారుడు ఫిలిప్ పాక్సన్ సెప్టెంబర్ 30, 2022న మరణించాడు. అందుకు కారణం... అతని జీప్ గ్లాడియేటర్ హికోరీలోని స్నో క్రీక్‌ లో పడిపోవడమే.

Update: 2023-09-21 13:42 GMT

హండ్రెడ్ మీటర్స్ టెక్ లెఫ్ట్... 500 మీటర్స్ గో స్ట్రైట్ అంటూ మనం ఎంచుకున్న లొకేషన్ లోకి ట్రాఫిక్ కండిషన్స్ ని అర్ధం చేసుకుంటూ రూట్స్ మార్చూకుంటూ తీస్కెళ్తుంది గూగుల్ డ్రైవ్! అయితే ఈ మధ్యకాలంలో మానవ పనిలో లోపాలో.. లేక, యాంత్రిక శక్తి తప్పిదాలో.. కారణం తెలియదు కానీ గూగుల్ లొకేషన్ వల్ల ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు వాహన ప్రయాణికులు.

అందులో భాగంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం గుడాటిపల్లి సమీపంలో "గో స్ట్రైట్.. గో స్ట్రైట్" అంటూ చెప్పి ఒక లారీని గౌరవెళి జలాశయంలోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సంగతి అలా ఉంటే... గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ కూలిపోయిన వంతెనపై నుండి కారు నడుపుతూ మరణించాడు ఒక వ్యక్తి.

అవును... నార్త్ కరోలినాకు చెందిన వైద్య పరికరాల విక్రయదారుడు ఫిలిప్ పాక్సన్ సెప్టెంబర్ 30, 2022న మరణించాడు. అందుకు కారణం... అతని జీప్ గ్లాడియేటర్ హికోరీలోని స్నో క్రీక్‌ లో పడిపోవడమే. అందుకు కారణం... గూగుల్ డ్రైవ్ రాంగ్ డైరెక్షన్ అనేది వారి అభియోగం. ఈ మేరకు వేక్ కౌంటీ సుపీరియర్ కోర్ట్‌ లో తాజాగా వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ సమయంలో తమ అమ్మాయిలు డాడీ ఎలా చనిపోయారని, ఎందుకు చనిపోయారని అడుగుతారని.. వారికి తాను చెప్పలేకపోతున్నానని ఫిలిప్ పాక్సన్ భార్య అలీసియా పాక్సన్ చెబుతున్నారు. ఇదే క్రమంలో... జీపీఎస్ దిశలు, మరమ్మతులు చేపట్టకుండా వదిఒలేసిన వంతెనలు మానవ జీవితంపై విలువ చూపకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయని అలీసియా పాక్సన్ చెప్పారు.

ఈ సందర్భంగా కోర్టులో విషయాన్ని చెప్పిన ఆమె... పాక్సన్ తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు పార్టీ నుండి ఒక తెలియని ప్రాంతం ద్వారా గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ ఇంటికి వెళ్తున్నాడని.. ఈ సమయంలో తొమ్మిదేళ్ల క్రితం కుప్పకూలి, మరమ్మత్తులకు నోచుకోని వంతెనను దాటాలని గూగుల్ మ్యాప్ అతనికి సూచించిందని ఆరోపించారు.

ఇదే క్రమంలో... బోల్తా పడి సగం మునిగిన ట్రక్కులో ఫిలిప్ పాక్సన్ మృతదేహాన్ని రాష్ట్ర సైనికులు గూర్తించారని.. ఈ సందర్భంగా కూలిన వంతెనకు సంబంధించిన రహదారి వెంట ఎటువంటి హెచ్చరిక సంకేతాలు లేవని చెప్పినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే... ఈ వంతెన ప్రభుత్వ అధికారులతో నిర్వహించబడలేదని, డెవలపర్ కంపెనీ ఎప్పుడో రద్దు చేసిందని నార్త్ కరోలినా స్టేట్ పెట్రోల్ పేర్కొంది.

అదేవిధంగా... కుప్పకూలిన వంతెనపై డ్రైవర్‌ లను నిర్దేశిస్తున్నట్లు కంపెనీ హెచ్చరించినట్లు సెప్టెంబరు 2020లో మ్యాప్‌ లోని "సవరణను సూచించండి"ఫీచర్‌ గురించి గూగుల్ కి తెలియజేసినట్లు ఇమెయిల్ రికార్డ్‌ లు ఉన్నాయని.. గూగుల్ నుండి నవంబర్ 2020 ఇమెయిల్ నిర్ధారణను కంపెనీ తన నివేదికలో స్వీకరించిందని, సూచించిన మార్పును సమీక్షిస్తోందని నిర్ధారించింది.

అయితే గూగుల్ తదుపరి చర్యలు తీసుకోలేదని మంగళవారం కోర్టు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో... పాక్సన్ కుటుంబం పట్ల తమకు ప్రగాఢ సానుభూతి ఉందని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా అసోసియేటెడ్ ప్రెస్‌ తో అన్నారని అంటున్నారు. మ్యాప్స్‌ లో కచ్చితమైన రూటింగ్ ఇన్ ఫర్మేషన్ అందించడమే తమ లక్ష్యమని.. తాము ఈ వ్యాజ్యాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారని సమాచారం.

Tags:    

Similar News