కాల్పుల ద్వారా మరణశిక్ష విధించే కంట్రీస్ ఇవే!
రెగ్యులర్ గా విధించే జైలు శిక్షల సంగతి కాసేపు పక్కనపెడితే... మరణ శిక్ష అనేది కచ్చితంగా ప్రత్యేకమైనదే. అయితే ఇందులో కూడా రకరకాల పద్దతులు ఉన్నాయి.
ప్రపంచంలో ఒక్కో దేశంలోనూ శిక్షలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే నేరానికి వివిద దేశాల్లో వివిధ రకాలుగా శిక్షలు ఉంటాయి. రెగ్యులర్ గా విధించే జైలు శిక్షల సంగతి కాసేపు పక్కనపెడితే... మరణ శిక్ష అనేది కచ్చితంగా ప్రత్యేకమైనదే. అయితే ఇందులో కూడా రకరకాల పద్దతులు ఉన్నాయి. వాటిలో శిరచ్ఛేధం ద్వారా మరణ శిక్ష విధించే దేశాలు కూడా ఉన్నాయి!
అవును... హత్య, అత్యాచారం, వికృత హింస వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన చాలా దేశాలలో అమలులో ఉన్నప్పటికీ... ఆ మరణ శిక్షను అమలు చేసే విషయంలో మాత్రం చాలా వైరుధ్యాలున్నాయి. సాధారణంగా భారతదేశంలో మరణశిక్ష అనేది ఉరి ద్వారా విధిస్తారు. ఈ శిక్ష విధించినప్పుడు దోషిని బయట ప్రపంచానికి చూపించకుండా జైలులోనే చేస్తారు.
ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం 170 దేశాలు మరణశిక్షను రద్దు చేయడం కానీ... ఈ మధ్యకాలంలో అమలు చేయకుండా ఉండటం కానీ చేస్తున్నాయి. ఇదే సమయంలో 2022లో కనీసం 21 దేశాలు ఉరిశిక్షలను అమలు చేశాయని తెలుస్తుంది. ఇందులో అత్యధికంగా ఇరాన్ లో సుమారు 600 మరణశిక్షలు అమలు చేయగా... జపాన్ లో అత్యల్పంగా 1 మరణ శిక్షను అమలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి!
ఇదే సమయంలో నివేదికల ప్రకారం ప్రపంచంలోని 58 దేశాల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరి తీయడం ద్వారా శిక్ష అమలు చేస్తుండగా... సుమారు 73 దేశాల్లో మరణశిక్షను తుపాకితో కాల్చడం ద్వారా అమలుపరుస్తారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, సూడాన్ తో సహా ఆరు దేశాల్లో మరణశిక్షను రాళ్లతో కొట్టి చంపే విధానంతో అమలు చేస్తారు.
ఇదే క్రమంలో... యెమెన్, బహ్రెయిన్, చిలీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఆర్మేనియా వంటి దేశాల్లో కాల్పుల ద్వారా మరణశిక్ష విధిస్తారని అంటున్నారు. ఇదే క్రమంలో... చైనా, ఫిలిప్పీన్స్ తో సహా ప్రపంచంలోని ఐదు దేశాలలో పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలుచేస్తాయి. ఇక ఇప్పటికీ మూడు దేశాల్లో శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష విధిస్తారు.
అయితే... నేరం జరిగినప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, యువకులు, గర్భిణీ స్త్రీలు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను ఉరితీయడాన్ని అంతర్జాతీయ చట్టం స్పష్టంగా నిషేధిస్తుంది. అయితే లిబియా వంటి కొన్ని ఇదేశాలు చట్టవిరుద్ధమైన మరణశిక్షలను అమలు చేశాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఐదు పీపుల్స్ రిపబ్లిక్ లలో మూడు దేశాలు మరణశిక్షను కొనసాగిస్తున్నాయి. అవి బంగ్లాదేశ్, చైనా, ఉత్తర కొరియా కాగా... అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగు దేశాలు మరణశిక్షను కొనసాగిస్తున్నాయి. అవి... జపాన్, సింగపూర్, తైవా, యునైటెడ్ స్టేట్స్ కావడం గమనార్హం.