ఒకరు కాదు ఇద్దరు.. మాజీ ప్రధాని కుటుంబం పరువు మటాష్‌!

ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రజ్వల్‌ రేవణ్ణకు సహకారం అందించినందుకు అతడి తల్లి, దేవగౌడ పెద్ద కోడలు భవానీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-06-29 07:12 GMT

ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని, దాదాపు ఏడాది పాటు దేశాన్ని కూడా శాసించింది.. దేవగౌడ కుటుంబం. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) అధినేత దేవగౌడ. ఆ తర్వాత 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో దేశ ప్రధానిగా దాదాపు ఏడాది పాటు ఉండే అవకాశాన్ని కూడా దేవగౌడ దక్కించుకున్నారు.

మరోవైపు దేవగౌడ దేశ రాజకీయాల్లోకి వెళ్లిపోతే ఆయన కుమారుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా పలుమార్లు వెలుగొందారు. ఇక దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ, రేవణ్ణ కుమారులు ప్రజ్వల్‌ రేవణ్ణ, సూరజ్‌ రేవణ్ణ, రేవణ్ణ భార్య భవానీ, కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ, కుమారస్వామి రెండో భార్య రాధికా కుమారస్వామి.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దేవగౌడ పిల్లాజెల్లా అంతా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వీరిలో కొందరు గెలిచారు.. మరికొందరు ఓడారు.. ఇలా దాదాపు కుటుంబమంతా రాజకీయాల్లోనే తిష్ట వేసింది.

అలాంటి దేవగౌడ కుటుంబానికి ఇప్పుడు కష్టాల మీద కష్టాలు వచ్చాయి, దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్సు వీడియోల వ్యవహారంలో చిక్కుకుపోయారు. తనను సహాయం కోసం ఆశ్రయించిన వేలాది మంది మహిళలపై అత్యాచారాలు చేశాడని.. వాటిని వీడియోలు తీసుకున్నాడని.. వేలాది వీడియోలు కర్ణాటకలో హల్చల్‌ చేశాయి.

సొంత బంధువుల మహిళలను కూడా వదలకుండా ప్రజ్వల్‌ రేవణ్ణ తన కామ వాంఛను తీర్చుకున్నాడనే విషయం బయటపడింది. స్వయంగా అతడి చేతిలో అత్యాచారానికి గురయిన బంధువే ప్రజ్వల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక్కొక్కరుగా బయటకొచ్చి అతడి అకృత్యాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రజ్వల్‌ రేవణ్ణకు సహకారం అందించినందుకు అతడి తల్లి, దేవగౌడ పెద్ద కోడలు భవానీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో పరువు అంతా పోయిందని బాధపడుతున్న దేవగౌడ కుటుంబానికి ఇంకో షాక్‌ ఇచ్చాడు.. ఆయన మనుమడు సూరజ్‌ రేవణ్ణ. దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుమారుడే ఈ సూరజ్‌. ఎమ్మెల్సీ అయిన ఇతడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూరజ్‌ స్వలింగ సంపర్కుడు (హోమో సెక్సువల్‌) అని అతడు బయటపెట్టాడు. దీంతో పోలీసులు సూరజ్‌ ను కూడా అరెస్టు చేశారు.

సూరజ్‌ రేవణ్ణ తన భార్యతో అసహజ శృంగారానికి ప్రయత్నించడంతో ఆమె బెదిరిపోయిందని.. అతడితో విడాకులు కూడా తీసుకుందని వెల్లడైంది. అలాగే ప్రతి అమావాస్య నాడు సూరజ్‌ రేవణ్ణ అసహజంగా ప్రవర్తిస్తాడని.. ఎర్ర చీర ధరించి,, నల్లగాజులు వేసుకుని.. మల్లెపూలు పెట్టుకుని.. నుదిటిన పెద్ద బొట్టు పెట్టుకుని.. పెదాలకు లిప్‌ స్టిక్‌ పూసుకుని మహిళ మాదిరిగా తయారవుతాడని సూరజ్‌ చేతిలో అత్యాచారానికి గురయిన యువకుడు వెల్లడించాడు.

ఇంకోవైపు సూరజ్‌ రేవణ్ణలో ఆడ లక్షణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, హార్మోన్లలో హెచ్చుతగ్గులే ఇందుకు కారణమని వైద్యాధికారులు పోలీసులకు నివేదిక ఇచ్చినట్టు టాక్‌ నడుస్తోంది.

ఇలా అన్ని వైపులా మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దేవగౌడ చిన్న కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేంద్ర కేబినెట్‌ లో మంత్రిగా ఉన్నారు. దేవగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తమ కుటుంబం రోజురోజుకూ దిగజారుతున్నా ఏం చేయలేని పరిస్థితిలో వాళ్లిద్దరూ ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News