.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

డీఎస్ చేతిలో ఫోనుంటే చాలు.. సీఎం పదవి జస్ట్ మిస్!

"డీఎస్ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తారు" ఈ మాటలన్నది ఎవరో కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

Update: 2024-06-29 07:13 GMT

పీసీసీ అధ్యక్ష పదవి అంటే కాంగ్రెస్ లో సీఎంతో సమానం. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు ఆ పదవిని చేపట్టిన ప్రత్యేకత ఉన్న నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (75). ఈ రెండుసార్లూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం మరో ప్రత్యేకత. అయితే, ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డీఎస్ సమీప బంధువు, ఉమ్మడి ఏపీ మాజీ ఆర్థిక మంత్రి ఆర్గుల రాజారాం అడుగుజాడల్లో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాజారాం.. 1980ల్లోనే ఏపీలో పెద్ద నాయకుడు. ఈయన కూడా సీఎం రేసులో ఉండగా కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

డీఎస్.. వైఎస్.. జోడెద్దులు 1989లో డీఎస్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి పొందారు. 1994లో ఓటమిపాలైనా.. 1999, 2004లో గెలిచారు. కాగా, 1999-2004 మధ్య ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది. అలాంటి సమయలో 2004లో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన డీఎస్.. అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ తో కలిసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఉన్నత విద్యా శాఖ మంత్రిగా, ఇంటర్మీడియట్ విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు.

Read more!

ఫీజు రీయింబర్స్ మెంట్ ఈయన ఆలోచనే ఎందరో పేదింటి పిల్లలు ఉన్నత విద్య చదివేందుకు ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ఉన్నత విద్యా శాఖ మంత్రిగా డీఎస్ ఆలోచనే అని చెబుతారు. దీనిని అప్పటి సీఎం వైఎస్ సమర్థంగా అమలుచేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంది పేరు వచ్చింది. ఇక 2008లో డీఎస్ ను కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి పీసీసీ చీఫ్ గా నియమించింది. 2009 ఎన్నికల్లో వైఎస్ జోడీగా కాంగ్రెస్ ను గెలిపించారు. దీంతో వైఎస్-డీఎస్ జోడెద్దులు అనే పేరు వచ్చింది. సీఎంగా వైఎస్, పీసీసీ చీఫ్ గా డీఎస్ అద్భుత సమన్వయం మరే సీఎం, పీసీసీ చీఫ్ కూ సాధ్యం కాదనే చెప్పాలి.

ఫోన్ ఉంటే చాలు..

"డీఎస్ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తారు" ఈ మాటలన్నది ఎవరో కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తనకు సరిజోడీగా రాజకీయాల్లో ఉన్న డీఎస్ ను వైఎస్ ఆ విధంగా గౌరవించేవారు. కాగా, 2009 ఎన్నికల్లో ఓటమి డీఎస్ ను సీఎం అయ్యే చాన్స్ కోల్పోయేలా చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో నిజామాబాద్ లో 2009లో డీఎస్ ఓటమికి వివాదాస్పద వ్యాఖ్యలు కారణమయ్యాయి. ముస్లింల జోలికొస్తే చెయ్యి నరికేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేటు చేశాయని చెబుతారు. దీంతో 2009 సెప్టెంబరు 2న వైఎస్ ఆకస్మిక మరణంతో సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. శాసన సభ, మండలిలో సభ్యుడు కాకపోవడంతో సీఎం కాలేకపోయారు. ఆ తర్వాత 2013లో మండలి సభ్యుడు అయినా.. అప్పటికే చాన్స్ చేజారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. 2015లో తాను ఎంతగానో ఇష్టపడే కాంగ్రెస్ పార్టీని వీడిన డీఎస్ బీఆర్ఎస్ లో చేరారు. ఎంపీగా, సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ పార్టీనీ వీడారు. కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరడం డీఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి కల్పించింది. అయితే, అర్వింద్ ఎంపీగా గెలవడంతో డీఎస్ కు మనసులో ఆనందం కలిగించిందనే చెబుతారు.

Tags:    

Similar News