మెహర్ రమేశ్.. మళ్ళీ ఏదో చేస్తున్నట్లున్నాడే?
వివరాళ్లోకి వెళితే.. మెహర్ రమేశ్.. ఈ పేరు వినగానే అభిమానులు భయపడుతుంటారు. నిర్మాతలు వెనక్కి తగ్గుతారు! అనే మాటలు వినిపిస్తుంటాయి
ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మెహర్ రమేశ్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేసి మరో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయనపై ఉన్న కూస్తంత నమ్మకం కూడా అభిమానులకు పోయింది. అయితే ఇప్పుడాయన ఓ వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
వివరాళ్లోకి వెళితే.. మెహర్ రమేశ్.. ఈ పేరు వినగానే అభిమానులు భయపడుతుంటారు. నిర్మాతలు వెనక్కి తగ్గుతారు! అనే మాటలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఈయన కెరీర్ గ్రాఫ్ అలా ఉంది మరి. స్టార్ హీరోలందరికీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఈయనది! ఏ హీరోతో సినిమా చేసినా కూడా నెగిటివ్ రిజల్ట్ తప్ప పాజిటివ్ అనే పదమే ఈయనకు దాదాపుగా తెలియదనే చెప్పాలి. అన్ని చిత్రాలు దాదాపుగా దారుణంగా నిరాశ పరిచాయి.
ఎన్టీఆర్‌కు కంత్రి, శక్తి.. ప్రభాస్‌కు బిల్లా.. వెంకటేశ్‌కు షాడో వంటి పెద్ద పెద్ద పరాజయాలను అందించారు మెహర్ రమేశ్. ఈ వరుస పరాజయాలతో దాదాపు పదేళ్ల పాటు మెగాఫోన్ కూడా పట్టలేదు. ఒక్క సినిమా డైరెక్ట్ చేయలేదు. అయితే ఈయన కెరీర్లో కూడా రెండు పెద్ద హిట్లు ఉన్నాయి. అవి ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో తీసినవి. ఈ రెండు తప్ప ఇప్పటివరకు ఆయనకు హిట్లే లేవు.
పదేళ్ల తర్వాత భోళాశంకర్‌తో మెగాఫోన్ పట్టిన ఆయన.. ఈ చిత్రంతో అయినా సక్సెస్ రుచి చూస్తారనుకుంటే అది జరగలేదు. చిరుకు అతిపెద్ద డిజాస్టర్ తగిలింది. దీంతో ఆయన మళ్లీ కొద్ది రోజుల నుంచి కనపడట్లేదు. అయితే తాజాగా ఇప్పుడాయన ఓ వెబ్ సీరీస్ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది.
ఈ సారి కంప్లీట్ కమర్షియల్ యాంగిల్‌కు భిన్నంగా చేస్తున్నారట. ఓ ఓటీటీ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ వెబ్సిరీస్తోనైనా ఆయన రాత మారుతుందా లేదా అనేది..