ఏపీలో ఇంటింటికీ పింఛ‌న్లు.. ఉన్న‌ట్టా..లేనట్టా...?

అయితే.. ఈసారి కూడా ఇంటింటికీ పంపిణీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం వ‌లంటీర్ వ్య‌వ‌స్థపై దృష్టి పెట్ట‌లేదు.

Update: 2024-06-23 16:30 GMT

ప్ర‌స్తుతం ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రో 7 రోజుల్లో రాష్ట్రంలో సామాజి క భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయాల్సి ఉంది. జూలై 1వ తేదీ లేక‌పోతే..మ‌రుస‌టి రోజైనా.. ఈ పింఛ‌న్ల కోసం.. వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈసారి కూడా ఇంటింటికీ పంపిణీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం వ‌లంటీర్ వ్య‌వ‌స్థపై దృష్టి పెట్ట‌లేదు.

వాస్త‌వానికి తాము అధికారంలోకి వ‌స్తే.. జూలై 1న ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేసే బాధ్య‌తను తీసుకుం టామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అది కూడా వలంటీర్ల ద్వారా నే పంపిణీ చేస్తా మ‌న్నారు. ఇక‌, పింఛ‌న్ల పెంపు అంశంపై మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నా.. సొమ్ములు స‌మ‌కూర్చా ల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు పంపించినా.. ఇంటింటికీ పంపిణీ చేసే విష‌యంలో మాత్రం ఇంకా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోలేదు.

అస‌లు ఈ విష‌యంపై ఇంకా దృష్టి కూడా పెట్ట‌లేదు. గ‌త మేలో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను అధికారిక విధుల నుంచి ఎన్నిక‌ల సంఘం దూరం పెట్టింది. దీంతో వ‌లంటీర్లు ఇంటికే ప‌రిమి త‌మ‌య్యారు. ఇక‌, కొంద‌రు రాజీనామాలు చేశారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు వీరిని గాడిలో పెట్ట‌లేదు. ఫ‌లితం వ‌చ్చి.. స‌ర్కారు ఏర్ప‌డి 10 రోజుల‌కు పైగానే అయినా.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించేదీ లేనిదీ చెప్ప‌లేదు. ఇదేస‌మ‌యంలో 1వ తారీకు ఇంటింటికీ పంపిణీ చేసే పింఛ‌న్ల‌పైనా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

మ‌రో 7 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారిం ది. ఉన్న‌వారినే కొన‌సాగించాలన్నా.. వారి నుంచి ద‌ర‌ఖాస్తులు తీసుకుని స్క్రూటినీ చేసుకుని.. నియామ కాలు చేప‌ట్టేందుకు ఎంత లేద‌న్నా.. వారం రోజులు ప‌డుతుంది. ఇదేస‌మ‌యంలో కొత్త‌వారిని నియ‌మిం చుకునేందుకు ప్ర‌య‌త్నించినా.. అది కూడా వారం ప‌డుతుంది.

కానీ, ఇంత‌లోనే 1వ తారీకు వ‌చ్చేస్తుం ది. మ‌రి ఈ సారికి కూడా బ్యాంకుల్లోనే వేస్తారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది చంద్ర‌బాబు ప్ర‌క‌టించాల్సి ఉంది. ఎలానూ రెండు మాసాలుగా బ్యాంకుల‌కు వెళ్లి తెచ్చుకున్నారు కాబ‌ట్టి.. పింఛ‌న‌ర్లు అల‌వాటు ప‌డి ఉంటారు. దీంతో ఈ సారి ఇబ్బందులు రాక‌పోవ‌చ్చు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ పూర్తిస్థాయిలో ఏర్ప‌డే వ‌ర‌కు.. జూలై నెల వ‌ర‌కు ఇలానే చేస్తార‌ని భావించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News