ఆ ఎంపీ సీటు కోసం డీకే అరుణ పట్టు.. ఎందుకంటే?

దేశ రాజకీయాల్లోకి వెళ్తే.. యూపీఏ వర్సెస్ ఎన్డీయేగా ఫైట్ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే. వారి వారి మిత్ర పక్షాలతో రెండు అలయన్స్ లు ముందుకు వెళ్తాయి.

Update: 2023-12-16 07:20 GMT

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరగా.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ, అనుకూల ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టింది. ఇక పార్లమెంట్ మొదలు కానుంది. 2 లేదా 3 నెలల్లో ఎంపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను కూడా ఆయా పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై స్పందిస్తూ బీజేపీ ఒంటిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో మోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మాటలు పార్టీలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని చెప్పవచ్చు.

దేశ రాజకీయాల్లోకి వెళ్తే.. యూపీఏ వర్సెస్ ఎన్డీయేగా ఫైట్ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే. వారి వారి మిత్ర పక్షాలతో రెండు అలయన్స్ లు ముందుకు వెళ్తాయి. అయితే, ప్రస్తుతం దేశంలో మోడీకి ఆదరణ పెరుగుతోంది. ఇటీవల వచ్చిన సర్వేలు కూడా మరోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేకపోలేదని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల కంటే ఎక్కువ సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది.

ఇక కొత్తగా వచ్చిన మూడో ఫ్రెంట్ I.N.D.I.Aలో కాంగ్రెస్ కూడా భాగస్వా్మ్యం కావడంతో కాంగ్రెస్ యూపీఏ తరుఫున పోటీ చేస్తుందా లేక I.N.D.I.A తరుఫున బరిలోకి దిగుతుందా? అనేది వేచిచూడాలి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లను దక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. గెలిచిన అసెంబ్లీ స్థానాలు, వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుంటూ ధీమాగా ఉంది రేవంత్ టీమ్. అయితే మోడీ హవాతో ఇది సాధ్యమవుతుందా? వేచి చూడాలి.

ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీ స్థానంపై బీజేపీలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ఈ ఎంపీ స్థానాన్ని తనకే కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణ పేట డీకే అరుణ జన్మస్థలం. దీంతో పాటు ఆమె నాలుగు పర్యాయాలు మహబూబ్ నగర్ లోని గద్వాల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నిక్లలో ఆమెపై గెలిచిన బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె విజయం సాధించినట్లు కోర్టు ధృవీకరించింది. గతంలో గద్వాల నుంచే విజయం సాధించిన ఆమె వైఎస్, రోషయ్య ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్ గా కూడా కొనసాగారు.

మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ తనకు కేటాయిస్తే విజయం సాధిస్తానని ఆమె పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడితో నిన్న (డిసెంబర్ 15) ఈ విషయంపైనే భేలీ అయినట్లు పార్టీలో చర్చ కొనసాగుతోంది. అయితే ఇదే టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఇంకా తల్లోజు ఆచారి కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తసుకుంటుందని కిషన్ రెడ్డి ఆమెకు చెప్పినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News