డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. జైల్లో గడిపిన టైం ఎంతంటే...?

దీంతో జార్జియా జైల్ వద్ద ట్రంప్ పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-08-25 04:20 GMT

2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉన్న నేపథ్యంలో... ట్రంప్ రిస్క్ చేయలేదు. ఈ మేరకు జార్జియా జైల్‌ వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు!

అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్టు అయ్యారు. ఇదే సమయంలో బెయిల్ విషయంలో కూడా ఇప్పటికే అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి.. రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ ను సమర్పించి బెయిల్‌ తీసుకొవచ్చని సూచించింది.

దీంతో జార్జియా జైల్ వద్ద ట్రంప్ పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ సమయంలో బాండ్ లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు పట్టినంత సమయం ఆయన జైలులో 20 నిమిషాలు గడిపారు.

కాగా... ట్రంప్‌ పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటనేది తెలిసిన విషయమే. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా లొంగిపోయినా కూడా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు.

అయితే ఈ కేసులో వచ్చే ఏడాది మార్చి 4 విచారణకు ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రతిపాదిస్తుండగా.. ట్రంప్ లాయర్లు మాత్రం 2026కు విచారణ వాయిదా వేయాలని కోరుతున్నారు. ఎన్నికలపై

ఇక మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులు ఆయన ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News