రామాలయ ప్రారంభానికి రావొద్దు.. అద్వానీ కి ఎంత కష్టం?ట్విస్టు మిస్ అవ్వొద్దు!
అయోధ్యలో రామాలయ నిర్మాణం అన్న నినాదాన్ని.. దేశ వ్యాప్తంగా నినదించటమే కాదు.. ఆ ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చటంలో ఆయన పాత్ర ఎంత కీలకమన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే.
జీవితకాల కోరిక కళ్ల ముందు తీరుతున్న వేళ.. తాను ప్రత్యక్షంగా ఉండలేని కష్టం తాజాగా బీజేపీ పెద్దాయన లాల్ క్రిష్ణ అడ్వాణీకి ఎదురైంది. తన జీవితంలో సాధించాలని భావించిన అయోధ్య రామాలయం కళ్ల ముందు ఆవిష్కృతమైన వేళ.. దాని ప్రారంభానికి ఆయన్ను రావొద్దంటూ పేర్కొన్న వైనం చూసినప్పుడు.. పాపం.. పెద్దాయనకు ఎంత కష్టం అన్న మాట అనుకోకుండా ఉండలేం.
అయోధ్యలో రామాలయ నిర్మాణం అన్న నినాదాన్ని.. దేశ వ్యాప్తంగా నినదించటమే కాదు.. ఆ ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చటంలో ఆయన పాత్ర ఎంత కీలకమన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేనా..కాంగ్రెస్ హవా నడుస్తున్న దేశంలో బీజేపీకి ఒక రాజకీయ గుర్తింపును తీసుకురావటం.. ఈ రోజు ఇంత బలంగా మారటానికి ఆయన చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావని చెప్పాలి. అలాంటి 96 ఏళ్ల అద్వానీ రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎదురయ్యే గడ్డు పరిస్థిని ఆయన ఎప్పుడూ ఊహించి ఉండరనే చెప్పాలి. అయోద్యలోని వివాదాస్పద కట్టడం వల్ల కరసేవకులతో కలిసి నిర్వహించిన ఆందోళన.. అనూహ్య పరిణామాలకు తెర తీయటం తెలిసిందే. అయితే.. అయోధ్యపై దేశంలోని హిందువులు ఒక తాటి మీదకు వచ్చేలా చేయటంలో అడ్వాణీ.. మురళీమనోహర్ జోషిల పాత్రను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ ఇద్దరే లేకుంటే.. అయోధ్యలో రామాలయం అన్న ఆలోచన.. అక్కడితోనే ఆగేదని చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ జీవితంతో పాటు.. రామాలయం కోసం అడ్వాణీ చేసిన పోరాటం.. ఆయన జీవిత కల అయిన ప్రధానమంత్రి పదవిని.. రాష్ట్రపతి పదవిని దక్కకుండా చేసిందన్నది మర్చిపోకూడదు. తన ప్రియాతి ప్రియమైన శిష్యుడు మోడీ ప్రధానిగా ఉన్న వేళలో.. దేశ అత్యున్నత పదవి దక్కలేదు. తాజాగా.. అయోధ్యలో రామాలయ ప్రారంభం జనవరి 22న జరుగుతున్న సందర్భంగా దాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం లేకుండా పోయింది.
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అద్వానీ.. మురళీ మనోహర్ జోషిలు ఇద్దరు పెద్ద వయస్కులు కావటం.. వారి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావొద్దంటూ రామ మందిరం ట్రస్టు తాజాగా వెల్లడించింది. తాజాగా ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వినతిని ఇద్దరు అగ్రనేతలు మన్నించారని.. వారిద్దరు రామాలయ ప్రారంభోత్సవానికి రావట్లేదని పేర్కొన్నారు.
ఇదంతా చెప్పిన చంపత్ రాయ్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిజానికి ఈ ఎపిసోడ్ మొత్తానికి అసలుసిసలు ట్విస్టుగా చెప్పాలి. రామాలయ ప్రారంభ కార్యక్రమానికి 90 ఏళ్ల మాజీ ప్రధాని దేవెగౌడను ఆహ్వానించేందుకు మాత్రం ముగ్గురు సభ్యులు టీంను ఏర్పాటు చేశామని చెప్పారు. 96 ఏళ్ల అడ్వాణి.. 89 ఏళ్ల మురళీ మనోహర్ జోషి వద్దుకానీ.. 90 ఏళ్ల దౌవెగౌడను మాత్రం ఆహ్వానించటమా? ఇదంతా చూస్తుంటే.. ఏదో అనిపించట్లేదు?