ప్రిన్సెస్ సంచలనం... "ఐ డైవర్స్‌ యూ.. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య"!

అవును... దుబాయ్ ప్రిన్సెస్ షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-17 13:39 GMT

"ప్రియమైన భర్తకు... మీరు ఇతరుల సహచర్యం ఎక్కువగా కోరుకున్నందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఐ డైవర్స్ యూ.. టేక్ కేర్.. మీ మాజీ భార్య" అంటూ ఇన్ స్టాలో ఓ సంచలన పోస్ట్ దర్శనమిచ్చింది. అయితే... ఈ పోస్ట్ పెట్టింది దుబాయ్ ప్రిన్సెస్ షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ కావడంతో ఈ విషయం ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది!

అవును... దుబాయ్ ప్రిన్సెస్ షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం.

ఇలా దుబాయ్ ప్రిన్సెస్ ఇన్ స్టా వేదికగా విడాకుల విషయాని ప్రకటించిన సమయంలోనే... దంపతులిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేయడం.. వారు కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా... మరికొందరు మాత్రం ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

కాగా... దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మొహ్రా అనే సంగతి తెలిసిందే. ఈమెకు 2023 మే 27న దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తో వివాహం జరిగింది. బ్రిటన్ లో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె... ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లో పట్టా పొందారు.

Tags:    

Similar News