"దువ్వాడ శ్రీనివాస్ వయసు అందరి దృష్టిలో 58.. నా దృష్టిలో 30"!

ఇక ప్రధానంగా తిరుమలలో ఫోటో షూట్ లు చేసుకున్నారని.. రీల్స్ చేశారని విమర్శలు బలంగా వినిపించాయి.

Update: 2024-10-12 17:30 GMT

దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇటీవల తిరుమలలో చెప్పిన పెళ్లి కబురు.. అనంతరం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వెరసి మరోసారి అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ మరోసారి వీరిరువురూ ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.

ఇక ప్రధానంగా తిరుమలలో ఫోటో షూట్ లు చేసుకున్నారని.. రీల్స్ చేశారని విమర్శలు బలంగా వినిపించాయి. ఇదే సమయంలో... పెళ్లిల్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా ఓ టీవీ కార్యక్రమంలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

మరోపక్క తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ మాధురిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది! ఈ నేపథ్యంలో ఈ విషయాలపై స్పందించిన మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవ్ను... తిరుమలలో అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ కేసు నమోదవ్వడంపై మాధురి స్పందించారు. తాను కొండమీద రీల్స్ చేయలేదని.. తాను వద్దని చెబుతున్నా కొంతమంది తన వెంటపడి వీడియోలు, ఫోటోలు తీశారని అన్నారు. ఇదే క్రమంలో... తాను రీల్స్ చేసినట్లు, షూట్ చేసినట్లు ఒక్క ఫోటో అయినా ఉందా? అని ఆమె ఎదురు ప్రశ్నించారు.

ఇక... ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీలలో కార్యకర్తలందరితో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లినట్లు చెప్పిన మాధురి.. మరి ఆ తేదీలలో తనపై ఎందుకు కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు. తాను కేవలం పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన తర్వాతే తనపై కేసులు నమోదు చేశారని.. ఇవి పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగానే పెట్టారని ఆరోపించారు.

ఇదే సమయంలో కొండమీద మాట్లాడకూడదనే విషయం తనకు తెలియదని.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. ఇక గతంలో ఎన్నోసార్లు తాను మాడవీధుల్లో తిరిగినట్లు, నాట్యం చేసినట్లు మాధురి తెలిపారు. ఇక తనపై నమోదైన కేసులో న్యాయపరంగా అన్ని కేసులూ ఎదుర్కొంటామని అన్నారు.

ఇదే సమయంలో దువ్వాడపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని.. టెక్కిలిలో దువ్వాడ శ్రీనివాస్ ను ఎదురించేవారు ఎవరూ లేరని మాధురి ధీమాగా చెప్పారు. అదేవిధంగా... ఇంటిలో ప్రేమ, ఆప్యాయత కోల్పోవడం వల్లే దువ్వాడ కు తాను తోడుగా ఉంటం అని అన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ వయసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా.. అందరి దృష్టిలో దువ్వాడ శ్రీనివాస్ వయసు 58 కానీ.. నా దృష్టిలో మాత్రం ఆయన ఏజ్ 30 అని.. ఈ జనరేషన్ కంటే ఆయన ముందు ఉంటారని.. ఆయన దగ్గర నేర్చుకునేందుకు చాలా ఉందని.. దువ్వాడ ప్రతీ అడుగులోను తాను వెనకుండి నడిపిస్తానని.. దువ్వాడను మంత్రిగా చూడాలనేది తన కళ అని మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాజకీయాలంటే నాకు చాలా ఇష్టమని చెప్పిన మాధురి.. ఈ విషయంలో దువ్వాడ వద్ద ఓనమాలు నేర్చుకుంటానని అన్నారు. ఇదే క్రమంలో... తన భర్త బోస్ కు విడాకులు ఇస్తానని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... దువ్వాడది తనదీ అపవిత్రబంధం కాదని.. తమది పవిత్ర బంధం అని అన్నారు. విడాకుల అనంతరం ఇద్దరం కలిసి ఉంటామని పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News