దువ్వాడ శ్రీనివాస్ సంచలన నిర్ణయం... వాట్ నెక్స్ట్?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ ఎన్నో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-19 08:35 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ ఎన్నో మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు, జలక్కులు, దాడి యత్నాలు, కేసులు, ఆత్మహత్యాయత్నాలు, వాట్సప్ చాటింగ్ లీకులు వెరసి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... ప్రస్తుతం రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అంశం ఏదంటే దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ అని చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి, కుమార్తె ఎన్నో ఆరోపణలు చేయగా... తనపై వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఈ తన విచిత్ర కథకు విడాకులే పరిష్కారం అంటూ శ్రీను చెబుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా చెబుతున్న మాధురి వ్యవహారమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ట్రోల్స్ చేస్తున్నారని.. తనపై వాణి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని.. అందువల్ల తాను మనస్థాపానికి గురైనట్లు చెబుతూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు! ఇక ఇటీవల ఓ ట్వీవీ ఛానల్ ఇంటర్వూలో వాణి... కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తమకు ఆస్తులు అక్కర్లేదని, రాజకీయాలూ వద్దని.. తాము ఎప్పటిలాగా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే చాలని.. ఇదే తమ డిమాండ్ అని దువ్వాడ శ్రీనివాస్ భార్య తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇంకా వివాహం కావాల్సిన ఒక కుమార్తె ఉన్నారని.. సమాజం కోసమైనా తాము కలిసి ఉండాలని.. ఇక ఆయన ఎలా ఉన్నా అది ఆయన ఇష్టమని అన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా దువ్వడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా భార్య వాణి, కుమార్తె హైందవి పై చర్యలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనపై దాడి చేసి, రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారని.. అయినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పై స్పందించిన హైకోర్టు.

ఇందులో భాగంగా... వాణి, హైందవిలపై ఏమి చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది... పోలీసులు కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు విచారణకు ఆదేశించింది.

మరోపక్క... దువాడ శ్రీనివాస్ కు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని.. పోలీసులు తనకు, తన భర్తకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని వాణి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News