మరోసారి వార్తల్లో లాటరీ కింగ్... ఈడీ ఎంట్రీ షురూ!

అవును... లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. వాస్తవానికి అతనిపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.లు మూసివేయాలనే పోలీస్ అభ్యర్థనకు గతంలో దిగువ కోర్టు ఆమోదం తెలిపింది.

Update: 2024-11-14 12:30 GMT

ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్ల డేటా బయటకు రాగానే దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయిన పేరు.. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్. ఈయన తన కంపెనీ అయిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఏప్రిల్ 2019 - జనవరి 2022 మధ్య ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,368 కోట్ల విరాళాలతో అతిపెద్ద దాతగా రికార్డులకెక్కిన పరిస్థితి.

అయితే... ఈ విధంగా దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన సంస్థలకు సంబంధించిన తెర వెనుక అంశాలు ఇవి అంటూ కొన్ని కథనాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి! దీంతో... ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీల ఎంట్రీ ఉంటుందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ విషయంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది.

అవును... లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. వాస్తవానికి అతనిపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.లు మూసివేయాలనే పోలీస్ అభ్యర్థనకు గతంలో దిగువ కోర్టు ఆమోదం తెలిపింది. దీనికి భిన్నంగా మద్రాస్ హైకోర్టు అతడిపై విచారణకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో... గురువారం ఉదయం నుంచి చెన్నై సహా పలు ప్రాంతాల్లోని అతడి ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. గతేడాది కూడా సిక్కిం ప్రభుత్వానికి రూ.900 కోట్లు నష్టం తీసుకొచ్చిన కేసులోనూ ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలో సుమారు రూ.450 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

కాగా... తొలినాళ్లలో శాంటియాగో మార్టీన్ మయన్మార్ లో కూలీగా పనిచేశారు. అనంతరం 1988లో ఇండియాకు తిరిగొచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించారు. దీన్ని తమిళనాడు అంతటా విస్తరిస్తూ... కేరళ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు నేపాల్, భూటాన్ లలో కూడా లాటరీ స్కీములు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్, హోటల్ ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా, టెక్స్ టైల్స్ బిజినెస్ లలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మార్టిన్ నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రపంచ లాటరీ అసోసియేషన్ లో సభ్యత్వం కూడా ఉంది. ఇది ఆన్ లైన్ గేమింగ్ తో పాటు క్యాసినో లను కూడా నిర్వహిస్తుంది.

ఈ క్రమంలోనే ఆయనను లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చిన కంపెనీగా నిలిచింది! ఇదే సమయంలో మార్టిన్‌ పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దాడులు స్టార్ట్ చేసింది!

Tags:    

Similar News