జనసేనకు ఈసీ భారీ షాక్ ఇచ్చేసిందా...?
జనసేన పార్టీ పెట్టిన పదేళ్ళకు తెలంగాణాలో పోటీ చేస్తోంది. రెండు రాష్ట్రాలలో పోటీ చేసి బలంగా ఉనికిని చాటుకోవాలని చూస్తోంది
జనసేన పార్టీ పెట్టిన పదేళ్ళకు తెలంగాణాలో పోటీ చేస్తోంది. రెండు రాష్ట్రాలలో పోటీ చేసి బలంగా ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో 32 సీట్లకు పోటీ చేస్తామని చాలా కాలం ముందే జనసేన ప్రకటించేసింది.
అయితే ఈ మధ్యలో మారిన చాలా కీలక పరిణామాల నేపధ్యంలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇక జనసేనకు ఏపీ సెటిలర్స్ బాగా ఉన్న చోట ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది. పవన్ సైతం ప్రధాని మోడీ సభలో పాలు పంచుకున్నారు.
అంతా బాగానే ఉంది అనుకుంటున్న నేపధ్యంలో జనసేన సింబల్ గాజు గ్లాస్ జనసేన అభ్యర్ధులకు కేటాయిస్తున్నారా లేదా అన్న చర్చ సాగుతోంది. గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ లిస్ట్ లో పెట్టేసింది. అంటే తెలంగాణాలో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది సీట్లు తప్పించి మిగిలిన 111 సీట్లలో ఎవరికైనా ఈ గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేయవచ్చు అన్న మాట.
అదే జరిగితే పవన్ కళ్యాణ్ తెలంగాణా ఆశలు, ఆయన పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్ధుల ఆశలు కూడా పూర్తిగా గల్లంతు అవుతాయని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎనిమిది మంది అభ్యర్ధులకు కూడా కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తు ఇస్తారా అన్నది ప్రశ్నగా ఉంది అంటున్నారు.
ఎందుకంటే జనసేన ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన పార్టీ కాదు, రిజిస్టర్ అయిన పార్టీగానే ఉంది. ఒక పార్టీని ఎవరైనా రిజిష్టర్ చేసుకోవచ్చు. అయితే ఆ పార్టీని ఎన్నికల సంఘం గుర్తించి శాశ్వత గుర్తుని కేటాయించాలి అంటే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. లేదా నాలుగురు ఎమ్మెల్యేలు అయినా గెలవాల్సి ఉంటుంది.
ఏపీలో చూస్తే జనసేన ఆరు శాతం ఓట్లు సాధించినా ఎమ్మెల్యే ఒక్కరే గెలిచారు. కాబట్టి ఇప్పటికీ ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించలేదు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ వేరే అభ్యర్ధిని ఆ గాజు గ్లాస్ గుర్తుని కేటాయించిన విషయం కూడా గమనార్హం.
ఇక తెలంగాణాలో చూసుకుంటే జనసేన పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం. అయితే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసే వారు మొత్తం అసెంబ్లీ సీట్లకు చేయడం సహజం. అలా కనుక చేస్తే అందరికీ కలిపి కామన్ సింబల్ అడగవచ్చు. అలా ఎన్నికల సంఘం వారికి కేటాయిస్తునిద్. అలా కాకుండా మొత్తం సీట్లలో 15వ శాతం సీట్లలో పోటీ పడుతోంది జనసేన.
దాంతో జనసేనకు కామన్ సింబల్ ఇవ్వడం అన్నది సమస్యగా ఉంది. దాంతో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులు టెన్షన్ లో పడుతున్నారు. అదే విధంగా జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీకి ఈ పరిణామం ఆందోళన కలిగించేదే అంటున్నారు. బీజేపీకి పడాల్సిన ఓట్లు గాజు గ్లాస్ గుర్తు ఉన్న ఇండిపెండెంట్ కి వెళ్ళిపోతే అపుడు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.