మల్కాజిగిరి లో వెరీ టైట్ ఫైట్

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండటం. బీజేపీకి 37.38 శాతం ఓటర్ల మొగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి 35.38 శాతం జనాలు మొగ్గుచూపారు.

Update: 2024-03-17 05:56 GMT

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ జెండా ఎగరేస్తారా ? ఇపుడీ విషయమే రాజకీయపార్టీల్లో బాగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ తరపున ఈటల పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ఇంకా తేలలేదు. ఇప్పటికైతే ఈటల చాలా పాపులరనే చెప్పాలి. ఇదే విషయమై జనలోక్ అనే సంస్ధ ఒపీనియర్ పోల్ నిర్వహించింది.

ఒపీనియన్ పోల్ అన్నా సర్వే అన్నా ఒకటే అని అందరికీ తెలిసిందే. ఈ పోల్ లో 37.38 శాతం ప్రజలు బీజేపీకి ఓట్లేస్తామని చెప్పారట. అలాగే కాంగ్రెస్ కు 35.38 శాతం ప్రజలు జై కొట్టారట. బీఆర్ఎస్ కు 24.93 మంది జనాలు మొగ్గుచూపినట్లు తేలింది. ఇతరులు కూడా 2.5 శాతం ఓట్లు సంపాదించుకునే అవకాశాలున్నట్లు పోల్ లో తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండటం. బీజేపీకి 37.38 శాతం ఓటర్ల మొగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి 35.38 శాతం జనాలు మొగ్గుచూపారు. అంటే రెండుపార్టీల మధ్య తేడా కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే.

అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే బీజేపీ అభ్యర్ధిగా ఈటల పోటీచేస్తుంటే కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేసేది ఇంకా తేలలేదు. బహుశా బీజేపీలో కీలక నేత, మాజీఎంపీ జితేందర్ రెడ్డి పోటీచేసే అవకాశముందంటున్నారు. ఇదే జరిగితే ఈటల గెలుపు ఎలాగుంటుందో తెలీదు. అలాగే జితేందర్ ప్లేసులో ఇంకెవరిని అయినా గట్టి నేతను అభ్యర్ధిగా దింపితే కూడా ఈక్వేషన్లు మారిపోతాయి. ఇప్పటికి ప్రకటించిన ఈటల, రాగిడి అభ్యర్ధిత్వాల్లో మెజారిటి జనాలు ఈటల బెటర్ అనుకునుండచ్చు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో తేలిన తర్వాత మళ్ళీ ఒపీనియన్ పోల్ లేదా సర్వేచేస్తే అప్పుడు సమీకరణలు మారిపోతాయేమో తెలీదు. ఏదేమైనా ఇప్పటికైతే మెజారిటి జనాలు ఈటలవైపున్నట్లు తేలింది. చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లే బీఆర్ఎస్ మూడోప్లేసులో నిలిచింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News