ప్రముఖ వ్యాపారవేత్త మిస్సింగ్.. 12 గంటల తర్వాత డెడ్ బాడీ
మిస్సింగ్ సమాచారం అందుకున్నంతనే పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కర్ణాటకలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) కనిపించకుండా పోయారు. పన్నెండు గంటల అనంతరం ఆయన డెడ్ బాడీని పోలీసులు గుర్తించిన వైనం షాకింగ్ గా మారింది. మరణించిన సదరు వ్యాపారవేత్త మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేకు స్వయాన సోదరుడు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం ఉదయం మిస్ అయిన ఈ వ్యాపారవేత్త కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మిస్సింగ్ సమాచారం అందుకున్నంతనే పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చివరకు భారీగా డ్యామేజ్ అయిన బీఎండబ్ల్యూ కారులో ఆయన డెడ్ బాడీని గుర్తించారు. కుల్లూరు మంతెన సమీపంలో కారును వదిలిపెట్టి వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులకు సైతం ఒక పట్టాన విషయం అర్థం కానట్లుగా మారింది. దీనిపై సీరియస్ గా ఫోకస్ చేసిన అధికారులకు ముంతాజ్ అలీ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మిస్ అయ్యారన్న సమాచారం అందుకున్న తర్వాత నుంచి పన్నెండు గంటల పాటు శ్రమించి.. ఆయన డెడ్ బాడీని నది ఒడ్డున గుర్తించారు.
ముంతాజ్ అలీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. మిస్బా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఛైర్మన్ గానూ గుర్తింపు పొందారు. మిస్ అయినట్లుగా చెబుతున్న ముంతాజ్.. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. కుల్లూరు వంతెన సమీపంలో ఆయన కారును నిలపటానికి ముందు నగరం మొత్తం ఆయన కారులో తిరిగినట్లుగా గుర్తించారు. అలీ చివరి మాటలతో అప్రమత్తమైన ఆయన కుమార్తె స్పందించి.. పోలీసులకు సమాచారం అందించటంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతకూ ముంతాజ్ మిస్సింగ్ ఉదంతం ఎలా చోటు చేసుకుంది? ఆయన మరణంలో బాధ్యులు ఎవరు? అన్నది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారింది. దీన్ని చేధించే క్రమంలో ఒక మహిళ డబ్బుల కోసం బెదిరించటం.. బ్లాక్ మొయిల్ చేసిన ఆరోపణలపై మహిళను.. అరుగురిని నిందితులుగా గుర్తించారు. మరణం వెనుక మిస్టరీ లెక్క తేల్చేందుకు వీలుగా ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపారు. నివేదికతో మిస్టరీపై ఒక స్పష్టత వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.