రూ.2వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ మాస్టర్ మైండ్.. సినీ నిర్మాత అరెస్టు!
అవును... డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ మెంబర్ జాఫర్ సాదిక్ ను అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది.
జాఫర్ సాదిక్... ఇటీవల కాలంలో మారుమ్రోగిపోయిన పేరు! డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ప్రధాన సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి! సుమారు నాలుగు నెలలుగా పరారీలో ఉన్న సినీ నిర్మాత! అయితే... ఇతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) వెల్లడించింది. ఇదే సమయంలో డ్రగ్స్ అకర్మ రవాణా కేసులో ఇతడే సూత్రధారి అని తెలిపింది.
అవును... డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ మెంబర్ జాఫర్ సాదిక్ ను అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఈ సందర్భంగా... భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల మధ్య డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్ లో ఇతడే మాస్టర్ మైండ్ అని, సూత్రధారి అని ఎన్.సి.బీ. అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు ఇతడు సుమారు 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి రెండు వారాల క్రితం తమిళనాడుకు చెందిన నలుగురిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులు... తమ దేశాలకు ఆహార ఉత్పత్తుల ముసుగులో భారీ ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు భారత ఏజెన్సీలకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు చెబుతారు.
కాగా... తమిళనాడులో భారీ ఎత్తున మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మదురైలోని కొంతమంది రైల్వే ప్రయాణికుల వద్ద, చెన్నైలోని ఓ డంప్ యార్డ్ లోనూ సుమారు రూ. 180 కోట్ల విలువైన మత్తు పదార్థాలను అధికారులు గుర్తించారు. వీటిని తమిళనాడు నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు.
ఈ సమయంలో ఈ భారీ అంతర్జాతీయ డ్రగ్స్ దందా బయటపడిందని తెలుస్తుంది. ఇక ఈ నెట్ వర్క్ వెనుక ప్రధానంగా జాఫర్ సాదిక్ ఉన్నట్లు తెలియడంతో.. అధికారులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో అతడి ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరిపారు. ఈ క్రమంలో సుమారు 4 నెలల పాటు జాఫర్ తప్పించుకు తిరుగుతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ రోజు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్.సి.బి. ప్రకటించింది.
ఇక కోలీవుడ్ సాదిక్ జే.ఎస్.ఎం. పిక్చర్స్ బ్యానర్ పై ఇరైవన్ మిగ పెరియవన్, మాయావలై, మాంగై అనే మూడు సినిమాలు నిర్మించిన జాఫర్... నాల్గవ చిత్రం వీఆర్-07 ఈ నెలలో విడుదల కానుందని తెలుస్తుంది! ఇదే క్రమంలో... 2010 లో రాజకీయాల్లోకి ఎంటరైన అతడు.. డీఎంకే పార్టీ ఎన్.ఆర్.ఐ. విభాగానికి ఆఫీస్ బేరర్ గా పనిచేశాడు. అయితే... అతడిపై డ్రగ్స్ స్మగ్లింగ్ కి సంబంధించిన ఆరోపణలు రావడంతో... పార్టీ అతడిని గత నెల సస్పెండ్ చేసింది.