కిమ్ జోంగ్ నియంతృత్వానికి పరాకాష్ట.. అధికారులకు మరణశిక్ష..
అయితే ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఇంకా ఎందరో వరద కోరల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. జులై ఆగస్టు మధ్యకాలంలో ఉత్తర కొరియాలో కూడా ఇలాంటి వరదలే సంభవించాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
కిమ్ జోంగ్ ఉన్ ఎటువంటి నియంతృత్వ పాలకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వారినైనా ఆశ్చర్యపరుస్తుంది. చిన్న చిన్న తప్పులకి కూడా ఎంతో ఘోరమైన శిక్షలు విధించే కిమ్ జోంగ్.. 2019లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కిమ్ అతనితో జరిపిన చర్చలను సరిగ్గా సమన్వయం చేయలేదు అని ఉత్తరకొరియా అణు రాయబారి కిమ్ హోక్ చోల్ కు కిమ్ మరణశిక్ష విధించారు.అలాగే భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల సమయంలో విపత్తు నిర్వహణను నిర్లక్ష్యం చేశారు అని ఆరోపణతో దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించారు.
ఈ విషయానికి సంబంధించి కథనాలు పలు అంతర్జాతీయ మీడియాలలో కూడా వచ్చాయి. అవినీతికి పాల్పడడంతో పాటు తమ విధులలో నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అనే కారణం ఈ ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించడం జరిగింది. అనంతరం కొద్ది రోజులకే ఈ శిక్షను అమలు కూడా చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తలపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు. అంతేకాదు ఆ అధికారులు ఎవరూ అనే విషయంపై కూడా ఎక్కడా ఎటువంటి ప్రకటన ఇవ్వడం జరగలేదు.
చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ
సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ ఈ శిక్ష విధించిన వారిలో ఒకడు అన్న ప్రచారం జరుగుతుంది. విపత్తు జరిగిన సమయంలో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కిమ్..హూన్ను ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం ఇందుకు ముఖ్య కారణం. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు ఎందుకంటే అతని రాజ్యంలో ఇలాంటి శిక్షలు విధించడం సర్వసాధారణం.