మనసుమార్చుకున్న మాజీ ఐఏఎస్... ప్రభుత్వం నో వే?
అవును... వీఆరెస్స్ తీసుకున్న వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తొందరపడ్డారంట! మనసు మర్చుకుని మళ్లీ సర్వీసులోకి వస్తానంటున్నారు.. ఈ మేరకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా తనను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేశారు. దీంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.
అవును... వీఆరెస్స్ తీసుకున్న వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన... తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతున్నారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు గల కారణం అప్పట్లో తాను తీవ్ర మానసిక ఇత్తిడిలో ఉండటమేనని ఆయన చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారని అంతున్నారు. అయితే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రవీణ్ ప్రకాశ్ ను కలిసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోరాదని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారని అంటున్నారు. ఆయన వీఆరెస్స్ తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని నొక్కి చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా... ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉండగానే జూన్ 25న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఆమోదం తెలుపుతూ ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ జూలై మొదటి వారంలో జీవో జారీ చేశారు.. ఆయన వీఆరెస్ సెప్టెంబర్ 30నుంచి అమలులోకి వస్తోందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.